అవసరం కోసం డబ్బులు విత్‌డ్రా చెద్దామని ఏటీయంకి వెళ్ళి రూ. 500 /` విత్‌డ్రా కొడితే రూ. 2500/` వచ్చాయి ఒకతనికి. దీంతో ఆశ్చర్యపోవటం అతని వంతయ్యింది. వందకి 500 రూపాయలు వస్తుండటం గురించిన వార్త దావానలంలా వ్యాపించడంతో వెంటనే నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎం వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా ఖపర్ ఖేడా పట్టణంలో తాజాగా వెలుగుచూసింది. బ్యాంకు ఖాతాదారుల్లో ఒకరు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు ఏటీఎం వద్దకు వచ్చి మూసివేయించారు. పోలీసులు బ్యాంకుకు సమాచారం అందించారని ఖాపర్‌ఖేడా పోలీస్‌స్టేషన్ అధికారి తెలిపారు. ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా అదనపు నగదు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 100 డినామినేషన్ నోట్లను పంపిణీ చేయడానికి ఉద్ధేశించిన ఏటీఎం ట్రేలో 500 డినామినేషన్ కరెన్సీ నోట్లను తప్పుగా ఉంచినట్లు బ్యాంకు అధికారి చెప్పారు.దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.