గాడిదే కదా అని తీసిపారేయకండి, గాడిదలతో లక్షల్లో సంపాదన !

0

అందరూ వెళ్ళే దారిలో నడిస్తే ఏముంటుంది, తన కంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకోవాలనుకున్నాడు ఆ యువకుడు, చివరకు తన మార్గాన్ని తానే సృష్టించుకున్నాడు. లక్ష రూపాయాలు సంపాదించే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని ఊరు బాట పట్టాడు. ఉద్యోగాన్ని వదులుకున్నందుకు అందరూ పిచ్చోడు, తిక్కలోడు క్రింద జమ కట్టారు ఊరు జనం. అయినా ఎవరిని లెక్క చేయక తన లక్ష్యం వైపు కదిలాడు. ఎవరూ ఊహించని విధంగా గాడిదలతో ఫామ్‌హౌస్‌ నెలకొల్పాడు. ఇప్పుడు గాడిద పాలతో లక్షలు సంపాదిస్తున్నాడు.


గాడిద పాలలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ఇప్పటికీ గ్రామాల్లో చిన్న పిల్లల్లో ఉబ్బసం వ్యాధికి ఔషదంగా గాడిద పాలను పట్టిస్తారు. ఈ పాయింట్‌నే వ్యాపార సూత్రంగా మలచుకున్నాడు. మేలురకం గాడిదల కోసం కర్ణాటక అంతటా గాలించాడు. చివరకు 20 గాడిదలతో ఫామ్‌హౌస్‌ నెలకొల్పాడు. గాడిద పాలలోని ఔషద గుణాలను వివరిస్తూ బెంగళూరుతోపాటు వివిద నగరాల్లో మార్కెటింగ్‌ చేయటం ప్రారంభించాడు. ఎక్కడా నిరాశ ఎదురుకాలేదు. ఊహించనదాని కంటే ఎక్కువ రెస్పాన్స్‌ రావటం మొదలైంది. వ్యాపారులు మాకు కావాలంటే మాకు కావాలి అని ఎగబడ్డారు. గాడిద పాలను పాకెట్లలోకి అందుబాటులోకి తీసుకువచ్చి అందిస్తున్నాడు. 30 మిల్లీలీటర్ల పాల ధర రూ. 150/`గా నిర్ణయించాడు. ఇప్పటికే రూ. 17 లక్షల రూపాయల ఆర్డర్లు వచ్చాయని తెలిపాడు శ్రీనివాస్‌ గౌడ్‌. ఇది ఐరాకు చెందిన శ్రీనివాస్‌ గౌడ్‌ సక్సెస్‌ స్టోరి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !