పొగిడే వాళ్ళు పొగడని, తిట్టే వాళ్ళు తిట్టని...డోంట్‌కేర్ అంటోంది అనసూయ భరద్వాజ్. ఇటు బుల్లితెరపైనా, అటు వెండితెరపైనా తనదైన నటనతో అలరిస్తోంది. బుల్లితెర, వెండితెరతో పాటు అనసూయకి మరో ముఖ్య వ్యాపకం సోషల్ మీడియా. అక్కడ ఓ రేంజ్ లో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఆమె.. తరచుగా తనకి సంబంధించిన ఫోటోస్ ను, వీడియోస్ ను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. ఆ క్రమంలో ఆమె పిక్స్‌కు పాజిటివ్ కామెంట్స్‌తో పాటు నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చిపడుతుంటాయి.
గతంలో చాలా సార్లు అనసూయకి నెగెటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్‌తో గొడవ కూడా జరిగింది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన పిక్స్‌ను విమర్శిస్తూ కామెంట్స్ పెట్టారు. ‘నువ్వు ముసలాదానివైపోతున్నావ్, ముఖంలో గ్లో తగ్గింది, మేకప్ సరిగ్గా వేయలేదా? అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. మరికొందరు అందంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నిజానికి అనసూయ ఎప్పుడు ఫోటోస్ షేర్ చేసినా.. డ్రస్‌ల గురుంచో, అందం గురుంచో రచ్చ చేయటం అలవాటుగా మారింది. ఈ వ్యవహారం ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.