కాదేది సంపాదనకు అనర్హం...కొత్త ఆదాయ మార్గాల్లో సామ్‌ !

0


దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత సరిగ్గా సరిపోతుంది సామ్‌కి. అటు సినిమాలు, ఇటు ప్రకటనలు ద్వారా బాగానే సంపాదిస్తున్న సమంత...ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ను ఆదాయ వనరుగా మార్చుతుంది. ఇప్పుటికే ఇన్‌ స్టాలో సమంతకు రెండు కోట్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. అందుకే సామ్‌ ఏ పోస్ట్‌ పెట్టిన ఆ పోస్ట్‌ నిముషాల్లో వైరల్‌ అవుతుంది.పైగా సామ్‌ ఫ్యాన్స్‌ కాస్త నెక్ట్స్‌ లెవల్లో కనిపిస్తారు. పోస్ట్‌ ను షేర్‌ చేస్తూ ట్రెండిరగ్‌లోకి తీసుకొస్తారు.అందుకే సామ్‌ తన ఇన్‌ స్టా అకౌంట్‌లో ఒక్క పోస్ట్‌ పెడితే చాలు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందిస్తున్నాయట వ్యాపార సంస్థలు.

ఇలా మొత్తంగా సమంత ఒక్క ఇన్‌స్టా ఖాతా నుంచే నెలకు రూ. 3 కోట్లు అందుకుంటుందంట. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న విరాట్‌ కొహ్లీ..ఒక్క బ్రాండ్‌ని ప్రమోట్‌ చేయాలంటే..రూ. 50 కోట్లు తీసుకుంటాడట. మొత్తానికి ఇన్‌ స్టా ద్వారా సంపాదన అనేది సినిమాను మించిన ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !