హైద్రాబాద్‌లో పెరిగిన వాయుకాలుష్యం !

0

నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఢల్లీి తరహాలో భాగ్యనగరంలో కూడా ఎయిర్‌ పొల్యూషన్‌ అవుతోందని సీపీసీబీ (సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు) వెల్లడిరచింది. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌ లోని సనత్‌నగర్‌లో గాలి నాణ్యతను పరిశీలించగా 213 పాయింట్లుగా నమోదైందని సీపీసీబీ సంస్థ పేర్కొంది. చలి పెరగడంతో దుమ్ము, ధూళి కణాలు గాలిలో కలవడం లేదు. పైపైనే ఓ పొరలా ఏర్పడుతున్నాయని తెలిపింది. గాలిలో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోందని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నవంబర్‌ 7వ తేదీన సనత్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. జూపార్క్‌ లో 162, హెచ్‌సీయూలో 101, రామచంద్రాపురంలో 77, మలక్‌ పేటలో 55 పాయింట్లుగా నమోదైంది. సనత్‌నగర్‌ లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న పరిసర ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ సీపీసీబీ తాజా లెక్కల ప్రకారం గాలి నాణ్యత 324 పాయింట్లుగా నమోదయ్యింది. 2.5 మైక్రాన్ల మందమున్న సూక్ష్మ ధూళి కణాలు కొన్ని కోట్లలో అక్కడ ఉండడం కాలుష్యం పెరిగేందుకు ప్రధాన కారణమైంది. నాణ్యతా సూచీల్లో ముంబైలో 232, బెంగుళూరులో 119, చెన్నైలో 105 పాయింట్లు నమోదయ్యాయి. దీపావళి పండుగ నుంచి గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. బాణాసంచా కాల్చడంతో కాలుష్యం మూడిరతలు పెరిగింది. తర్వాతి రోజుల్లో గాలి నాణ్యత పర్వాలేదన్న స్థాయికి చేరుకున్నా.. గత వారం రోజులగా గాలిలో నాణ్యత తగ్గుతోంది. తాజాగా హైదరాబాద్‌ లో రెండు, మూడు ప్రాంతాలు మినహా 50 నుంచి 170 పాయింట్ల వరకూ నమోదయ్యాయి.

వేల సంఖ్యలో చెట్లున్నా వాహనాల రాకపోకలు, పరిశ్రమల కారణంగా జూపార్క్‌ వద్ద గాలి నాణ్యత సూచీలో 162 పాయింట్లు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. హైదరాబాద్‌లో ఇప్పటినుంచైనా కాలుష్య నియంత్రణ చర్యలు పట్టకపోతే దిల్లీ లాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !