ర్యాంకులు వాడుకుంటే రాయల్టీ కట్టాల్సిందే...తల్లిదండ్రుల కొత్త వాదన !

0


లక్షలకు లక్షలు ఫీజు ముక్కుపిండి వసూలు చేసుకుంటున్న కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఇక నుండి కొత్త తలనొప్పులు మొదలైనట్టే చెప్పాలి. మేము ఇన్ని ర్యాంకులు సాధించాం, మేము అన్ని ర్యాంకులు సాధింపజేశాం అని ఊదరకొడుతూ తల్లిదండ్రుల్ని మభ్యపెడుతున్న కొర్పొరేట్‌ విద్యాసంస్థలకు తల్లిదండ్రులే చెక్‌ పెట్టబోతున్నారు. టెన్త్‌ మరియు ఇంటర్‌ నుండి మొదలుకొని అన్నిరకాల రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో టాప్‌100 ఇన్ని ర్యాంకులు మాకే వచ్చాయి. ఇవి మావే, అవి మావే అని చెప్పుకునే కొర్పొరేట్‌ సంస్థలకు ఆ ర్యాంకులు మావే అని చెప్పుకునేందుకు ఎలాంటి అర్హత లేదని పేరేంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మా విద్యార్థులే, మేము చెబితేనే ర్యాంకులు వచ్చాయి అని చెప్పుకొవటం కార్పొరేట్‌ సంస్థలకు ఎంత వరకు సమంజసం. మా పిల్లలు తమ స్వయం ప్రతిభతోనే ర్యాంకులు సాధిస్తున్నారు. సాధించిన ర్యాంకు వారి కష్టార్జితం. 

ఇక నుండి మా పిల్లలు సాధించిన ర్యాంకులు వాడుకుంటే మేము అడిగినంత సొమ్ముతో పాటు మా ర్యాంకులు వాడుకుంటున్నందుకు ఏటేటా రాయల్టీ కట్టాల్సిందేనని పేరేంట్‌ అసోసియేషన్‌ వాదిస్తోంది. ఒకవేళ మీరు చదువు చెబితేనే మా పిల్లలకు ర్యాంకులు వస్తే, మీ కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్కరికీ మీరు చెప్పే మంచి ర్యాంకు రావాలి కదా అని ఉటంకిస్తున్నారు. మీరు చదువు చెప్పినందుకు అడిగినంత ఫీజు చెల్లిస్తున్నాం కదా. మా పిల్లల ర్యాంకులు వాడుకునే హక్కు మీకు లేదు అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకువస్తున్నారు. మా పిల్లల ర్యాంకులు వాడుకుని మీరు బిజినెస్‌ చేసుకోవటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. అవును, ఇదీ నిజమే కదా. కొర్పొరేట్‌ సంస్థలు చేసేది వ్యాపారం అయినప్పుడు, ఆ ర్యాంకులు ప్రకటనలకు వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించటం న్యాయమే అని ఇతర సంఘాలు మాట కలుపుతున్నారు. చూద్దాం ఈ వాదన ఏ మలుపు తీసుకుంటుందో. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !