ఆరోగ్యానికి ఆరుసూత్రాలు !

0


కోవిడ్‌ అనంతరం యువత ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాల్సిన అగత్యం ఏర్పడిరది. నేటి రోజుల్లో కేవలం 20 ఏళ్ళ నుండి మొదలుకొని హార్ట్‌ఎటాక్‌లతో ఎప్పుడూ ఎవరికీ ఆపద ముంచుకొస్తుందో అని భయం వెంటాడుతోంది. ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం, వ్యాయమంతో పాటు అలవాట్లు కూడా ముఖ్యమే అంటోంది ఆయుర్వేదం. మన శరీరంలో మలినాలు సాధ్యమైనంత తక్కువగా తయారు కావాలని చెబుతోంది. అంతేకాదు ఏర్పడిన మలినాలు ఎప్పటికప్పుడు తొలగిపోతూ ఉండాలని సూచిస్తోంది. ఆరోగ్యాన్ని నిత్యనూతనంగా ఉంచుకొనేందుకు ఆరు ముఖ్యమైన సూత్రాలను చెబుతోంది ఆయుర్వేదం. 

ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ నానుడికి తిరుగులేదు. ఎన్ని భోగభాగ్యాలున్నా పిసరంత ఆరోగ్యం లేకపోతే అవి ఎందుకూ కొరగావు. ఈ కఠిన సత్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఆదాయం, ఆర్జన, ఉద్యోగం, వ్యాపారమంటూ వాటి ధ్యాసలోనే కాలం గడుపుతున్నారు. చివరకు శారీరకంగానూ, మానసికంగానూ చిక్కిపోతున్నారు. గాడితప్పిన జీవన శైలి, తీరుతెన్నూ లేని ఆహారపు అలవాట్లు, శరీరానికి చాలినంత శ్రమలేక పోవటం వంటివి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలుసుకోవాలి. వయస్సు మీద పడుతున్న కొద్ది బయట పడుతున్న అనారోగ్యాలు, ఊహించని విధంగా గుండెపోట్లకు గురిఅయ్యి ప్రాణాలను కోల్పోవటం నేడు మనం చూస్తూనే ఉన్నాము. అయినా ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం పట్టింపు లేక పోవటం దురదుష్టకరం. 

ఎండలో కూర్చోవాలి !

హైదరాబాద్‌లో ఉంటే 69 % ప్రజలు ‘డి’ విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారు అనేది లేటెస్ట్‌ సర్వే రిపోర్ట్‌. ఎండ తగలకుండా బ్రతుకడానికి అలవాటు పడుతున్న విషయం ఇక్కడ గమనించాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మలినాలు తక్కువగా తయారు కావాలి. ఏర్పడిన మలినాలు ఎప్పటికప్పుడు బయటకు పోవాలి. ఉదయం వచ్చే సూర్యరశ్మి శరీరానికి శక్తిని ఇస్తుంది. కొత్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆ సమయంలో పడే సూర్యకిరణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఆ జీర్ణశక్తి సరిపడా ఉంటే శరీరంలో మలినాలు ఎక్కువగా ఏర్పడవు, ఏమైనా ఏర్పడినట్లయితే ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లటం, ఎండలో కూర్చోవటం వంటివి తప్పనిసరిగా చేయాలి. 



చల్లటి గాలిలో గడపాలి !

చల్లని సాయంత్రం వేళ మంచి గాలిని పీల్చుకునే ఏర్పాటు చేసుకోవాలి. అంటే హాయిగా చల్లటి గాలిలో కొంతసేపు గడపాలి. చల్లని గాలి స్పర్శ శరీరానికి ఓ టానిక్‌లా పనిచేస్తుంది. ఇవే కాకుండా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ఎంతలా అంటే అది జీవన విధానంలో ఓ భాగమై పోవాలి. దీనివల్ల శరీరంలో మలినాలు చేరవు. అస్వస్థతకు గురయిన తరువాత చర్యలు తీసుకోవటం కంటే ముందుగానే ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవటం మంచిది. 

అతిగా తినటం ఆపాలి

ప్రస్తుత రోజుల్లో ఆహార నియమాలు పూర్తిగా గాడితప్పాయి. కొంతమందికి ఎప్పుడు తింటున్నాం, ఏం తింటున్నాం అనే ధ్యాసే ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తింటూ పొట్టను చెత్తకుప్పలా మార్చుకుంటున్నారు. శీతల పానీయాలు, కాఫీ, టీలను మితిమీరి తాగేస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, క్రిస్పి చికెన్‌లు అంటూ జిహ్వ చాపల్యం తీర్చుకుంటున్నారు. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు.



ఉపవాసం 

లంకణాన్ని పరమౌషధంగా పేర్కొంటోంది ఆయుర్వేదం. జీర్ణవ్యవస్థకు అప్పుడప్పుడూ విశ్రాంతి ఇవ్వాలని చెబుతుంది. తరచూ ద్రవ పదార్థాలు, పండ్లను తీసుకుంటూ, ఉపవాసాన్ని ఆచరించటం వల్ల శరీరంలో మలినాలు పేరుకుపోవటం తగ్గుతుంది. కొంతమంది నీరు ఎక్కువగా తాగితే మంచిదని అనుకుంటారు. రోజుకు ఎనిమిది లీటర్లకు మించి తాగుతుంటారు. నిజానికి ద్రవ పదార్థాలను అతిగా తీసుకోవటం వల్ల చెడే ఎక్కువ అని అంటారు వైద్యనిపుణులు.

ఆహార నియమాలు పాటించాలి.

మనం తీసుకున్న ఆహారం అంతా జీర్ణమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే ఆహారం విషయంలో అన్ని రకాల నియమాలు పాటించాలి. పరిమితంగా తినటం, నిర్ణీత సమయంలోనే ఆహారం తీసుకోవటం, తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేంత వరకు మళ్లీ తినకుండా ఉండటం వంటివి అవలంబించాలి.

నీటి విషయంలో నిగ్రహం.. 

తీసుకునే ద్రవ పదార్థాల విషయంలో పరిమితి పాటించాలి. ఇష్టారీతిన వ్యవహరించకూడదు. నీరు, ద్రవ పదార్థాలు వంటివి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా శీతల పానీయాలు, మద్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఇలాంటివి అనారోగ్యానికి కారణమవుతాయి. ఆధునిక జీవనశైలి పుణ్యమా అని చాలామంది ఆరోగ్యం గాలిలో దీపంగా మారింది. షుగర్‌, బీపీ, స్థూలకాయం, కొలెస్ట్రాల్‌, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్‌లు, నిద్రలేమి ఒక్కటనేమి ఏది ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియదు. దీనికి తోడు వైద్యం కూడా ఖరీదైన సరుకుగా మారింది. అందువల్ల చికిత్స కంటే నివారణ మేలు అనే సూత్రానికి అందరూ కట్టుబడాలి.


key words : health tips,health,good health,tips for good health,healthy lifestyle tips,tips for good mental health,health benefits,good health tips,mental health,good mental health tips,health tips for kids,healthy food,health tips for women,health tips for parents,best health tips for success,tips,olive oil for heart health,heart healthy foods,mental health awareness,healthy lifestyle,healthy,best tips for being healthy,heart health

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !