వేసవిలో చర్మ సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న వేడి కారణంగా చర్మం పొడిబారడం, రంగు (ట్యాన్) మారడం, మొటిమలు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. సాధారణంగా మన చర్మం మెలానిన్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. ఒకవేళ చర్మంపై ఎండ ప్రభావం ఎక్కువగా పడితే మెలానిన్ మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఎండలో ఎక్కువసేపు ఉంటే చర్మం రంగు మారడం లేదా చర్మంపై ట్యాన్ పెరగడం జరుగుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే ఈ కింద సూచించిన చిట్కాలు పాటించాలి.
తరచుగా ముఖాన్ని కడగాలి !
బయటకు వెళ్లి వచ్చాక ఫేస్ వాష్‌ను ఉపయోగించి సాధారణ నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఐస్ వాటర్‌తో కడిగితే ఇంకా మంచిది. ఇది చర్మానికి మరింత తాజాదనాన్ని ఇస్తుంది. అలాగే, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ను తప్పక ఉపయోగించాలి. ఇది సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఎస్.పి.ఎఫ్. 30 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించటం ఎంతైనా మంచిది.
ఫేస్ ప్యాక్ !
చర్మాన్ని రక్షించడంలో కలబంద చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, కలబందలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మం అలసట నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అలాగే, పసుపును ఉపయోగించడం కూడా చర్మానికి మంచిది. ఇది చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపునిస్తుంది. పసుపు, పెరుగు, శనగపిండితో కలిపిన మిశ్రమంతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చర్మానికి మంచి నిగారంపు వస్తుంది.
కళ్లు, పెదాల కోసం !
వేసవిలో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కళ్లకు సన్ గ్లాసెస్ ధరించడంతో పాటు పెదాలకు లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ భరించలేని వేడి కారణంగా కళ్లు అలసిపోతే చల్లని నీటిలో ముంచిన కాటన్ వస్త్రాన్ని కళ్లపై కొద్దిసేపు ఉంచాలి.
హైడ్రేట్‌గా ఉండడం !
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేట్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. వేసవిలో చెమట ఎక్కువ పడుతుంది దీంతో ఎక్కువ నీళ్ళు ఒంట్లో నుంచి వెళ్లిపోతాయి. కాబట్టి ప్రతి రోజూ ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండండి. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు ఎక్కువగా తీసుకోవటం వలన హైడ్రేట్‌గా ఉండొచ్చు. అదే విధంగా వేసవిలో కూరగాయలు పండ్లు కూడా ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల కూడా మీ చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.
key words : summer skin care,summer skin care tips,skin care tips,summer skin care routine,skin care,skin care routine,summer skin care hacks,summer skin care products,summer skin care home remedies,summer skin care for oily skin,oily skin care,summer skin care routines for oily skin,summer,skin care for summer,summer skin care 2023,best skin care tips, skin care for summer season,summer skin care for dry skin,teenage skin care for summer,skin care tips for summer