ChandraBabu Vision 2047 Comments Viral : ఇంజినీరింగ్‌ చదవాలంటే బైపీసీ చదవాలి !

0

 

  • విజన్‌ 2047 కార్యక్రమంలో నోరుజారిన చంద్రబాబు !
  • సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ !

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు తప్పులో కాలేశారు. ఏకంగా బీకాంలో ఫిజిక్స్‌ బ్యాచ్‌లో చేరిపోయారు. పార్టీ అధికారంలో లేకపోయినా, 2024లో గెలుస్తామనే ధీమాతో పాటు ఏకంగా 2047 విజన్‌ డాక్యమెంట్‌ పేరుతో చంద్రబాబు హడావిడి చేస్తున్నారు. లేని ఢాంబికాలు ప్రదర్శిస్తూ తానే అధికారంలో ఉన్నట్లు భ్రమిస్తూ...నేను మేధావిని...నేను విజనరీని అని ప్రజలకు తెలియాలి తన డప్పు తానే కొట్టుకుంటున్నారు. ఇప్పటి దాకా హైదరాబాద్‌ నిర్మించింది నేనే. ఐటినీ డెవలప్‌ చేసింది నేనే, ఆంధ్రప్రదేశ్‌ని ప్రపంచం పటంలో పెట్టింది నేనే అని ఊదరగొట్టే చందబ్రాబు ఇప్పుడు ఇండియాతో పాటు ప్రపంచం మొత్తానికి వచ్చే 25 ఏళ్ళకు దశదిశ చూపిస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చారు. ప్రపంచంలో తన కంటే పెద్ద మేధావి ఏవరూ లేరు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విశాఖలో ‘విజన్‌-2047’ను ప్రకటించిన చంద్రబాబు.. అదే సభలో ఇంజనీరింగ్‌ చేయాలంటే బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు మాట్లాడి తన డొల్లతనాన్ని ప్రపంచానికి చాటుకున్నారు. 

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే !

ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని, కంప్యూటర్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌ వరకు తానే ప్రోత్సహించానని, ఐటీకి తాత అని చెప్పుకునే చంద్రబాబుకి చదువులపై కనీస అవగాహన లేదని ఆయన చెప్పిన ఒక్క స్టేట్‌మెంట్‌తో అర్థమవుతోంది. ఇంజినీరింగ్‌ చేయాలంటే యం.పి.సి. చదవాలన్న కనీస ఇంగితం లేకపోవటం ఆయన మేధావితనానికి అద్దం పడుతోంది. ప్రపంచ మేధావి అభివృద్ధి సూక్తులు చెప్పబోతున్నాడు వినండహో అని టీడీపీ శ్రేణులు అప్పటికే చంద్రబాబు విజన్‌ 2047 గురించి భారీ ప్రచారం చేశాయి. విశాఖ నగరంలో చంద్రబాబు బీచ్‌ రోడ్‌ లో నిర్వహించిన సభకు జన స్పందన రాలేదు. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ విజన్‌ 2047 సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. బాబును జనాలు తెగ ట్రోల్‌ చేస్తున్నారు. బాబు వీడియోలను పట్టుకొని ట్రోల్‌ చేస్తున్నారు. చంద్రబాబు ఇజ్జత్‌ తీస్తూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

కాపీ చేయటం అలవాటుగా !

అభివృద్ధి చెందిన దేశాల నమూనాలను పరిశీలించటం వాటిని కాపీ చేసి విజన్‌ పేరుతో ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకి ఓ అలవాటుగా మారింది. దుబాయ్‌, సింగపూర్‌, జపాన్‌, అమెరికా దేశాలను పర్యటించిన ఏ సాధారణ యువకుడికైనా అభివృద్ధికి నిర్వచనం తెలిసిపోతుంది. ఎందుకుంటే వాళ్ళు ఇండియా కంటే సాంకేతికాభివృద్ధిలో 20 నుండి 25 ఏళ్ళు ముందుగా ఉంటాయి. ఆయా దేశాల్లో విజయవంతం అయిన తర్వాతే మనం దేశం అందిపుచ్చుకుంటోంది అనేది నిర్వివాదాంశం. అసలు చెప్పొచేదేమిటంటే చంద్రబాబే టెక్నాలజీని కనిపెట్టి జనానికి, ప్రపంచానికి అందించనట్లు కనికట్టు చేయటం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. 

భవిష్యత్తుకు గ్యారెంటీ...ఎవ్వరైనా ఇవ్వగలరా ?

కొన్న వస్తువులకే గ్యారెంటీ, వారెంటీ లేని రోజులివి. అలాంటి మాటకు గ్యారెంటీ ఎక్కడైనా ఉంటుందా ? ఒకవేళ చంద్రబాబు గెలిస్తే ఆయనకు, ఆయన కుమారుడికి, గెలిచిన నాయకులకి భవిష్యత్తుకు మాత్రమే గ్యారెంటీ ఉంటుంది కానీ మిగిలిన ప్రజలకు గ్యారెంటీ ఎక్కడుంటుంది. స్టాంప్‌ పేపర్‌ మీద రాసి సంతకం చేసి ఇస్తారా ?  18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500/`, ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే ప్రతి ఒక్కరికీ ఏడాదికి ఒక్కొక్కరికీ 15000/`, బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం, ప్రతి నిరుద్యోగికి నెలకి 3000/`, ప్రతి రైతుకి ఏడాదికి రూ. 20000/` సాయం, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం, 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాల భర్తీ ఇవి భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చేసిన టీడీపీ రూపొందించిన పథకాలు. ఈ పథకాలలో కొన్ని వైసీపీ పథకాలు, కొన్ని కర్ణాటక మరికొన్ని వివిధ రాష్ట్రాల పథకాలను కాపీ చేసినవి కావటం విశేషం. ఇవి అన్నీ మహిళలను టార్గెట్‌గా రూపొందించిన పథకాలే. కానీ ఎంత బడ్జెట్‌ అవుతుంది. లోటు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రం ఎలా ఇవ్వగలుగుతుంది అని ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. ఇవన్నీ అమలు సాధ్యం వాగ్ధానాలు అని. ఉదాహరణకి బస్సుల్లో మహిళందరికీ ఉచిత ప్రయాణం. ఉచిత ప్రయాణం అన్నప్పుడు గరుడ, సూపర్‌లగ్జరీ బస్సుల్లో సాధారణ మహిళలు ఎక్కితే ఉచితం తీసుకెళతారా. చివరకు భరించలేక పల్లెవెలుగులో మాత్రమే ఉచితం అని పథకాల్లో కోత విధించటం మనం చూస్తూనే ఉన్నాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !