నందమూరి నట సింహం బాలకృష్ణ ( NANDAMURI BALAKRISHANA) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి (BHAGAVANTH KESARI) .ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (ANIL RAVIPUDI) దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా చందమామ కాజల్ అగర్వాల్ (KAJAL AGRAWAL) నటించారు.అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల (SRILEELA) సినిమాలో బాలయ్య కూతురిగా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్‌పాల్ ( ARJUN RAMPAL)ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. షైన్ స్క్రీన్స్ (SHINE SCREENS ) బ్యానర్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించగా.. ఎస్.థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా రామ్‌ప్రసాద్ అలాగే ఎడిటర్ గా తమ్మి రాజు పని చేశారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా టికెట్ల బుకింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో భగవంత్ కేసరి సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి.
థియేటర్స్ దద్దరిల్లిపోవాలంతే...
తాజాగా సెన్సార్ సర్టిఫికషన్ వచ్చేసింది.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న షైన్ స్క్రీన్స్ కూడా ప్రకటించింది. భగవంత్ కేసరికి యూ/ఏ వచ్చిందంటూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది..భగవంత్ కేసరి చిత్రంలో ఒక్క కట్ కూడా చేయాలని సెన్సార్ బోర్డు మూవీ యూనిట్‌కు చెప్పలేదట. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ కంప్లీట్ అయిందని సమాచారం. ఇక, భగవంత్ కేసరి సినిమా రన్ టైమ్ (నిడివి) 164 నిమిషాల 30 సెకన్లు (2 గంటల 44 నిమిషాల 30 సెకన్లు)గా ఉంది.ప్రస్తుతం భగవంత్ కేసరి మూవీ టికెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. చాలా చోట్ల తొలి రోజు కొన్ని షోలకు థియేటర్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. బాలయ్యను ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఈ చిత్రంలో 3 షేడ్స్‌లో కనిపించబోతున్నాడని టాక్. ట్రైలర్ చూపించినట్లుగా తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.