రేణు దేశాయ్ ( RenuDesai) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బద్రి (Badri) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ను (Pavan Kalyan) ప్రేమించి పెళ్లాడిరది. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా, (AAkira) ఆద్య. ( AAdya) ఇక కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో రేణుదేశాయ్ పవన్ నుంచి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తుంది. ఇక పవన్ తో రేణు విడిపోయినా కూడా పవన్ ఫ్యాన్స్ ఇంకా ఆమెనే వదినమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు. ఇక దాదాపు ఆరేళ్ళ క్రితం రేణుదేశాయ్ (Renudesai) రెండో పెళ్లి (Second Marriage ) చేసుకోవడానికి రెడీ అయ్యింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను ఏకిపారేశారు. దీంతో ఆ పెళ్లిని రేణు క్యాన్సిల్ చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఇదే అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 23 ఏళ్ల తరువాత ఆమె టైగర్ నాగేశ్వరరావు ( Tiger NageswarRao) సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వూస్ ఇస్తున్న రేణుదేశాయ్ సినిమా విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది.
పిల్లలకు టైమ్ కేటాయించలేమోనని...
ఇక తాజా ఇంటర్వ్యూలో ఆమె తన రెండో పెళ్లి గురించి మాట్లాడిరది. ’’ పవన్ నుంచి విడిపోయేటప్పుడు అకీరా, ఆద్య చిన్న పిల్లలు. కుటుంబం, స్నేహితులు అందరు నన్ను రెండో పెళ్లి చేసుకోమని సలహాలు ఇచ్చారు. నాకు తోడుగా.. పిల్లలకు అండగా ఉంటారని కన్విన్స్ చేశారు. నేను కూడా వారు చెప్పినదానికి ఓకే అన్నాను. మా కుటుంబానికి, స్నేహితులకు నచ్చిన అతనితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాను. మాది లవ్ అనుకుంటున్నారు. కాదు.. అది కేవలం అరేంజ్డ్. నా గురించి అంతా చెప్పి.. ఓకే అన్నాక మేము ఎంగేజ్ మెంట్ చేసుకున్నాం, ఆ ఫోటోలను కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అప్పుడు ఆద్య వయస్సు 7. ఆ సమయంలో నాకు ఒకటి అనిపించింది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే.. అతనికి టైమ్ కేటాయించాలి. అప్పుడు ఆద్య కు టైమ్ ఇవ్వలేను. అందుకే నేను అప్పుడు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు ఆద్యకు 16 వచ్చాయి. ఒక సింగిల్ పేరెంట్ గా పిల్లలకు ఒక వయస్సు వచ్చేవరకు తోడు ఉండాలనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోలేదు. ఇంకో రెండు మూడేళ్ళ తరువాత నా గురించి నేను ఆలోచనలనుకుంటున్నాను. అప్పుడు పెళ్లి గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను. నా పిల్లలు చాలా స్వీట్.. అకీరాకు, నాకు మధ్య ఇలాంటి డిస్కషన్ వస్తుంది. నువ్వు వేరే వ్యక్తితో హ్యాపీగా, సుఖంగా ఉంటే చాలు అంటాడు. ఆద్య కూడా అదే అంటుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.