వన్డే ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. పూణె వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ శుభారంభం అందించారు. అయితే రోహిత్ 48 పరుగుల వద్ద అవుటై హాఫ్ సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అటు శుభ్‌మన్ గిల్ మాత్రం ప్రపంచకప్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. వీళ్లిద్దరూ అవుటైనా కోహ్లీ, కేఎల్ రాహుల్ విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా మ్యాచ్ చివర్లో కోహ్లీ సెంచరీ పూర్తి చేస్తాడా లేదా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే విరాట్ కోహ్లీ సిక్సర్‌తో ఇటు సెంచరీని, అటు జట్టు గెలుపును పూర్తి చేయడం మ్యాచ్‌కే ఆకర్షణగా నిలిచింది.వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది 48వ సెంచరీ. మరో సెంచరీ చేస్తే క్రికెట్ లెజెండ్ సచిన్ రికార్డును బద్దలు కొడతాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 97 బాల్స్‌లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి కేఎల్ రాహుల్ మంచి సహకారం అందించాడు. 34 బాల్స్‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అతడు 34 రన్స్ చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా 26వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 511 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
బంగ్లాదేశ్ బ్యాటింగ్
అంతకుముందు బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్లు తాంజిద్ హసన్ (51బీ 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), లిట్టన్ దాస్ (66బీ 82 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. తర్వాత వచ్చిన నజ్ముల్ శాంటో (8), మెహదీ హసన్ మిరాజ్ (3) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. తౌహిద్ హృదోయ్ (16), నసుమ్ అహ్మద్ (14) పరుగులు చేశారు. ముష్ఫీకర్ రహీమ్ (38బీ 46 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. చివర్లో మహ్మదుల్లా (46బీ 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, మహ్మద్ సిరాజ్ 2, జస్‌ప్రీత్ బుమ్రా 2, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.