స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. రిమాండ్ పొడిగింపుపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌ను నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడిరచింది. ఈ సందర్భంగా జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబుకు జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్టులను అందివ్వాలని ఆదేశించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఒకింత నిరాశ చెందాయి.