- సోనియాగాంధీ దయతోనే తెలంగాణ.
- తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడుండేవాళ్ళు.
- పార్టీని పణంగా పెట్టి తెలంగాణ సాకారం చేసింది కాంగ్రెస్.
తెలంగాణ సీఎం కేసీఆర్, (CM KCR )మంత్రి కేటీఆర్‌పై (KTR) టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( REVANTH REDDY ) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (SONIA GANDHI) కనుక తెలంగాణ (TELANGANA) ఇవ్వకపోయి ఉంటే కేసీఆర్, కేటీఆర్ బిచ్చమెత్తుకునే వారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పెద్దపల్లిలో (PEDDAPALLI) కాంగ్రెస్ విజయభేరి ( CONGRESS VIJAYABHERI ) యాత్రలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచించిన కేసీఆర్ మళ్లీ మూడోసారి అధికారం కోసం మీ ముందుకు వస్తున్నారు. రైతు రాజ్యం అని చెప్పి రైతును నట్టేట ముంచిన కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందన్న కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా? సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ బిచ్చమెత్తుకునే వారు.
పదేళ్లలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది?
యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ఎవరు? అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న మీరు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా?
అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు..
తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. తెలంగాణలో ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్ధిక సాయం. రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు రూ.12వేలు అందించనున్నాం. పెన్షన్ రూ.4వేలు అందించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.