Election Schedule : తెలంగాణలో నవంబర్‌ 30న ఎన్నికలు !

0

దేశంలో మరోసారి ఎన్నికల సందడి షురూ అయ్యింది. సాధారణ ఎన్నికలకు కూడా ఇంకా కొన్ని నెలల సమయం ఉండటంతో ఈ ఎన్నికలను పార్టీలు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. అన్నిరకాలుగా శక్తియుక్తులు కూడా తీసుకుని ఈ సెమీఫైనల్‌ లాంటి ఎన్నికల్లో నెగ్గితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమదే పైచేయి అవుతుందని పార్టీల తపపోస్తున్నాయి. అందుకు తగినట్లే అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. నేడు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. తెలంగాణలో 3.17కోట్లు, రాజస్థాన్‌లో 5.25కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03కోట్లు, మిజోరంలో 8.52లక్షల ఓటర్లున్నారు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 200, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌, మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. 

తెలంగాణ ఎన్నికల తేదీలు..

నోటిఫికేషన్‌ తేదీ: నవంబరు 3
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: నవంబరు 10
నామినేషన్ల పరిశీలన తేదీ: నవంబరు 13 
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 15

పోలింగ్‌ తేదీ: నవంబరు 30

ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !