Chandrababu news : ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు ?

0

 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్‌నెట్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. చంద్రబాబు ఆల్రెడీ ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ స్కామ్‌ కేసులో రిమాండ్‌ ఖైదీగా జైలులో ఉండటంతో.. డీమ్డ్‌ కస్టడీ గ్రౌండ్‌పై హైకోర్టు ఈ పిటిషన్లను రద్దు చేసింది. ఇక చంద్రబాబుకి బెయిల్‌, 5 రోజుల సీఐడీ కస్టడీకి ఇచ్చే పిటిషన్లపై లంచ్‌ తర్వాత విచారణ జరుపుతామని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఇక ఇన్నర్‌ రింగు రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌ కేసుల్లో చంద్రబాబును ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు పీటీ వారెంట్లు వేశారు. వీటిపై కూడా మధ్యాహ్నం లంచ్‌ తర్వాత విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ మూడు కేసుల్లో చంద్రబాబును అరెస్ట్‌ చేయటానికి ఇప్పటికే ఏపీ సీఐడీ పీటీ వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్‌ పిటీషన్లు దాఖలు చేశారు. హైకోర్టు నిర్ణయం చంద్రబాబుకు వ్యతిరేకంగా రావటంతో.. ఇప్పుడు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ మూడు కేసుల్లో అరెస్ట్‌ ఖాయం అయితే మాత్రం.. ఓ కేసులో బెయిల్‌ వచ్చినా.. మరో కేసులో అరెస్ట్‌ అవుతారు.. దీంతో వెంటనే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవనేది న్యాయ నిపుణులు అంచనా.

వరుస అరెస్ట్‌లు తప్పదా ?

హైకోర్టులో ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటీషన్లపై బెయిల్‌ తిరస్కరించగా, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అంగళ్ళు కేసుల్లో బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయటంతో తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. మున్ముందు పార్టీలోని ప్రముఖులు, ప్రదాన శాఖలు నిర్వహించిన మాజీమంత్రులు జైలుకు వెళ్ళే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటీషన్‌పై విచారణ జరగనుంది. ఒకవేళ ఈ కేసులో ఉపశమనం లభించినా, లభించకపోయినా మిగిలిన 3 కేసుల్లో బెయిల్‌ నిరాకరించటంతో చంద్రబాబుకు మరికొన్ని రోజులు జైలువాసం తప్పదని తెలుస్తోంది. ఒక కేసులో బెయిల్‌ వచ్చినా...మరో కేసులో అరెస్ట్‌ చేసేందుకు అయ్యే అవకాశాలు ఉన్నట్లు న్యాయనిపుణులు తెలియజేస్తున్నారు. అక్టోబర్‌ 12 న సీఐడీ ముందు హాజరుకానున్న లోకేష్‌ను ఒకటి రెండు రోజుల విచారణ అనంతరం ఫైబర్‌నెట్‌, ఇన్నర్‌రింగ్‌రోడ్‌ కేసుల్లో అరెస్ట్‌ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !