KTR : 70 స్థానాల్లో గెలుస్తాం...హ్యాట్రిక్‌ కొట్టేస్తాం !

0

70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొడతామని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇది తొలిసారి కాదన్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడారు. 2018 ఎన్నికల్లో  బీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వస్తాయని ఏ సర్వే కూడా గుర్తించలేకపోయిందని.. అప్పటి ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రజల చూశారని కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం 88కి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందన్నారు. తెలంగాణలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు అన్నీ తప్పాయి

2018లోనూ టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) ఓడిపోతుందని చాలా సంస్థలు చెప్పాయన్నారు. అప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు అన్నీ తప్పాయని గుర్తుచేశారు. అప్పుడు ఫలితాలు ఎలా వచ్చాయో.. ఈసారి కూడా అలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదని మంత్రి స్పష్టం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు అంత శాస్త్రీయ ఉందని అనుకోవట్లేదని చెప్పారు. పోలింగ్‌ జరుగుతుండగానే ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే జరుగుతుందని వెల్లడిరచారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఓటర్లు ఇంకా పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. డిసెంబర్‌ 3న 70 కంటే ఎక్కువ స్థానాలు బీఆర్‌ఎస్‌ పార్టీ​కు తప్పక వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే సంస్థల ఎగ్జిట్‌​ పోల్స్‌​ను ప్రజలు నమ్మొద్దని భరోసా కోరారు. బీఆర్‌ఎస్‌​ కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురి కావొద్దని సూచించారు. తెలంగాణలో 100 శాతం అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటి నుంచి రెండు నుంచి మూడు నెలల పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 2018లో బీఆర్‌ఎస్‌​కు 50 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు చెప్పలేదు. ఓటర్లు ఇంకా పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్నారు. డిసెంబర్‌ 3న 70 కంటే ఎక్కువ స్థానాలు బీఆర్‌ఎస్‌​కు తప్పక వస్తాయి. సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌​ను నమ్మొద్దు. కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురి కవొద్దు. 100 శాతం అధికారంలోకి వస్తాం’.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !