తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలకు తెరలేపారు. ఇప్పటికే చీరలు, నగదు, మద్యం ఓటర్లకు చేరుతోంది. మీటింగ్‌ల పేరిట జనాలకు డబ్బుతో పాటు మద్యం పెద్దఎత్తున పంపిణీ చేస్తున్నారు. మీటింగ్ వచ్చిన వారికి చికెన్, మటన్‌తో కూడిన భోజనాలు పెట్టటంతో కొన్ని చోట్ల తొక్కిసలాటలు జరుగుతున్నాయి. మరో వైపు ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, పోలీసులతో కలిసి పీర్జాదిగూడలోని ఓ కార్యాలయంలో దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో బీఆర్‌ఎస్ మంత్రి మల్లారెడ్డితో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 74 చీరలు, రూ.2 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని నగదు, ఎన్నికల ఉచితాల పంపిణీ కోసం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించారు.