KCR : సిఎం కేసీఆర్ రాజీనామా ...గవర్నర్‌కి అందజేత !
డిసెంబర్ 03, 2023
0
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కేవలం రెండు వాహనాల్లోనే రాజ్‌భవన్‌కు చేరుకుని కేసీఆర్ రాజీనామా పత్రాన్ని అందించారు. తాజాగా వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలైయింది. రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినట్లుగానే హస్తం పార్టీకి జనాలు విజయాన్ని అందించారు. ఇక రెండు చోట్ల పోటీ చేసిన కేసీఆర్.. ఒక చోట గెలిచి.. రెండో చోట ఓటమిని చవిచూశారు. గజ్వేల్‌లో గెలుపొందగా.. కామారెడ్డిలో పరాజయం పాలయ్యారు. మొత్తానికి తాజా ఫలితాలతో కారు బోల్తా పడిరది. ఊహించని ఫలితాలతో గులాబీ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు.
Tags