Sahiti infra : సాహితీ సంస్థకు బిగుస్తున్న ఉచ్చు.. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి

0

ఫ్రీలాంచ్‌ పేరుతో 1800 కోట్లు.. సాహితీ స్కామ్‌ చేసినట్లు పోలీసులు తేల్చారు. సాహితీ ఇన్‌ఫ్రాపై 50 కేసులు నమోదు చేసి స్పెషల్‌ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. సాహితీ సంస్థకు పోలీసులు రోజు రోజుకు ఉచ్చు బిగిస్తున్నారు. ఫ్రీలాంచ్‌ పేరుతో జనం సొమ్ము దోపిడీ చేసిన సాహితీ గ్రూప్‌ ప్రతినిధిల వివరాలు రాబట్టే పనిలో పడ్డారు. ప్రతి పైసా వివరాలు సేకరిస్తున్నారు సీసీఎస్‌ పోలీసులు. అన్ని ప్రాజెక్టుల బాధితులతో హైదరాబాద్‌ క్రైం అడిషనల్‌ కమిషనర్‌ రంగనాథ్‌ సమావేశమయ్యారు. ఇప్పటి వరకు సాహితీ స్కామ్‌ 1800 కోట్లుగా తేల్చారు. ఆ సొమ్మంత ఎక్కడికి పోయింది. దీని వెనుక ఉన్న నిందుతుల సమాచారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.సాహితీ సంస్థ నుంచి లక్ష్మీ నారాయణ తన కుమారుడికి నగదు ట్రాన్స్‌ ఫర్‌ చేశాడు. తర్వాత అతని అకౌంట్‌ నుంచి శిభ ఇన్ఫ్రా టెక్‌‎కు ఆ సొమ్ము తరలించారు. సాహితీ నుంచి ల్యాండ్‌ అడ్వాన్సుల రూపంలో పలు కంపెనీలకు నగదు వెళ్లింది. భూస్వాములకు ఇచ్చామంటున్న 104 కోట్లు, అడ్వాన్సుల రూపంలో తరలిన 129 కోట్లు, పర్సనల్‌‎గా వాడేసుకున్న 112 కోట్ల లెక్కలు బయటకు తీసి.. తమకు ఆ సొమ్ము తిరిగి ఇచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు కస్టమర్లు. అయితే భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండానే క్యాష్‌ డిపాజిట్ల ద్వారా 112.58 కోట్లను మళ్లించారు. 2019 నుంచి 2023 వరకు పలు దఫాలలో ఈ డిపాజిట్లు జరిగాయి. నగదు క్యాష్‌ డిపాజిట్‌ ఎలా చేశారు? బ్యాంకులు ఎలా యాక్సెప్ట్‌ చేశాయో దర్యాప్తులో తేలనుంది. ఈ మొత్తం వ్యవహారం పై సీసీఎస్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సంస్థ వెనుక ఉన్న వ్యక్తుల పాత్ర పై దర్యాప్తు చేస్తున్నారు. పక్కదారి పట్టిన నిధులు ఎవరెవరికి వెళ్లాయి అనే కోణం లో స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సాహితీ మోసాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం‎తో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !