టాలీవుడ్ రెబల్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్‌లో ఓ లగ్జరీ హౌస్‌ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్‌చల్ చేస్తోంది. గతంలో షూటింగ్స్, వేకేషన్‌కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ‘సలార్’తో గతేడాది ప్రేక్షకులను అలరించారు ప్రభాస్. ఎపిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ఇది రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ కోసం వర్క్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పోషిస్తోన్న భైరవ పాత్రను ఉద్దేశించి ఇటీవల నిర్మాత స్వప్నదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలుస్తుందన్నారు. మరోవైపు, మారుతితో ‘రాజాసాబ్’, ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ చేస్తున్నారు ప్రభాస్.