V. H : వి.హెచ్‌.కు రేవంత్‌ భరోసా !

0

తెలంగాణ రాజకీయాల్లో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ల మధ్య అంతర్గత విబేధాలు లేవని అందర్ని కలుపుకుపోతున్నామని రేవంత్‌రెడ్డి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కలుసుకున్నారు. ఖమ్మం లోక్‌సభ టికెట్‌ అశించ భంగపడ్డ విహెచ్‌ గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏకంగా ఇటీవల మీడియా ముందు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో మాట్లాడారు. బుజ్జగింపుల తర్వాత బుధవారం వి.హనుమంతరావును సీఎం వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. వీహెచ్‌కు అన్నివిధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.  

టికెట్‌ రాలేదని గుస్సా !

ఇదిలావుంటే, ఎంపీ టికెట్‌ అశించిన వీహెచ్‌ ఇటీవల సీఎం రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం ఒక సైడే వింటున్నారు. రెండో సైడ్‌ కూడా వినాలంటూ గుస్సా అయ్యారు. భజనపరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సీఎం ఆలోచనలో మార్పు రావాలన్నారు. సీఎం సమయం ఇవ్వడం లేదని, ప్రత్యర్థి పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానిస్తున్నారు, కానీ పార్టీలోని సీనియర్లను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని తగ్గించుకుంటున్నారన్నదే తన ఆవేదన అన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు ఎంపీ టిక్కెట్లు ఇచ్చి.. నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే వి.హనుమంతరావును దగ్గరకు పిలిపించుకుని సముదాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక  లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌.. మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం బుధవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. దీనిలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, సీఈసీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొననున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !