YS Jagna : బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే!

0

జగన్‌పైకి అందరూ కలిసికట్టుగా వస్తున్నారు.. కూటమి పేరుతో గుంపులుగుంపులుగా వస్తున్నారు.. వాళ్లందరికీ మీరే బుద్ధి చెప్పాలి.. చంద్రబాబుకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతారు.. బాబు వస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయ్‌.. బాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే.. బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే!..చంద్రబాబును నమ్మడమంటే పసుపుపతిని ఇంటికి తీసుకురావడమే... అంటూ సీఎం జగన్మోహన్‌ రెడ్డి కూటమి పార్టీలపై విరుచుకుపడ్డారు. తాడిపత్రి నుంచి మూడో విడత ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌.. చంద్రబాబుతో పాటు కూటమి హామీలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి.. ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్‌ నిప్పులు చెరిగారు. తన నమ్మకం ఆ దేవుడిపైనా, ప్రజలపైనేనని.. మేనిఫెస్టో ప్రకటించాక ఇప్పుడు మీ ఆశీర్వాదం కోరుతున్నానన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. ఇది చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యమన్నారు. పొత్తులు, మేనేజ్‌మెంట్లను నమ్ముకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్‌. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. మళ్లీ మోసం చేసేందుకు టీడీపీ-జనసేన- బీజేపీ కూటమిగా వస్తున్నాయన్నారు సీఎం జగన్‌. సూపర్‌ 6, సూపర్‌ 7 అంటున్నారని.. వారిని నమ్మొచ్చా అని ప్రశ్నించారు. 

అర్హులైన వారికి పథకాలు నేరుగా అందించాం !

ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా?. చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే. రూ.3 వేల పెన్షన్‌ అంటే గుర్తుకొచ్చేది జగన్‌. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్‌. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్‌. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్‌. మహిళా సాధికారిత అంటే గుర్తుకొచ్చేది జగన్‌. సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తుకొచ్చేది జగన్‌. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది జగన్‌. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చాం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్‌ ఉందా?’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు. 2లక్షల 30వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామమని.. 80శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామని జగన్‌ అన్నారు. పౌర సేవల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. నాడు నేడుతో స్కూళ్లను బాగుచేశాం.. ఇంగ్లీష్‌ మీడియంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. గ్రామాల్లోనే అన్ని సేవలు అందేలా మార్పులు తెచ్చాం.. 58 నెలల పాలనలో ఎన్నో మంచి పనులు చేసి చూపించామన్నారు. లంచాల్లేని, వివక్షలేని పాలన అందించామని అంటూ పేర్కొన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చామన్నారు. సామాజిక న్యాయానికి అసలైన అర్థం చెప్పామన్నారు. 75 శాతం పథకాలు పేద వర్గాలకే అందాయని.. సామాజిక న్యాయం అంటే ఏంటో చేసి చూపించామని జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబును చూస్తే కుట్రలు, కుతంత్రాలే కనిపిస్తాయని.. బాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? అంటూ ప్రశ్నించారు. 2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా చేయాలేదన్నారు. ప్రజలకు మంచి చేశాకే.. ఆశీర్వదించాలని అడుగుతున్నానన్నారు. రైతు రుణం ఎగ్గొట్టారు.. డ్వాక్రా లోన్లను మాఫీ చేయలేదు.. మ్యానిఫెస్టో మర్చిపోవడం బాబు నైజం అంటూ జగన్‌ విమర్శలు సంధించారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చారా..? పేదలకు సెంటు స్థలం కేటాయించారా ? అంటూ ప్రశ్నించారు. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !