Gangs of Godavari Review : గ్యాంగ్స్‌ ఆప్‌ గోదావరి మూవీ రివ్వ్యూ

0

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్‌ మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..

ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్‌ అలియాస్‌ రత్న(విశ్వక్‌ సేన్‌) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. ఒక గ్యాంగ్‌ని వేసుకొని రౌడీలా తిరుగుతూ కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్‌) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్‌ ఎమ్మెల్యే అవుతాడు. ఒక తగాదాలో నానాజీని కొడతాడు రత్న, ఆ దెబ్బకి నానాజీ చనిపోతాడు. ఈలోగా ఎంఎల్‌ఏగా ఓడిపోయిన రుద్రరాజు, రత్నపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. రత్నని ఎంఎల్‌ఏ గా ఓడగొడతాడు, రత్న ఇంటిపైకి రాళ్లు వేసి భార్యని భయపెడతాడు.  ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్‌ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్‌ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు ?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్‌ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్‌ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

విలేజ్‌ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్‌ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో  గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్‌ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్‌ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. సినిమా మొత్తం చూసుకుంటే నరుక్కోవడం, పొడుచుకోవడం తప్పితే, కథ ఏమీ లేదు. ఒక చిన్నపాటి రౌడీ ఒక్కసారిగా ఎమ్మెల్యే పక్కకి చేరిపోతాడు, వెంటనే అదే ఎమ్మెల్యే పై పోటీ చేసి గెలిచేసి ఎమ్మెల్యే అయిపోతాడు. వెంటనే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి, ఈసారి ఎమ్మెల్యేగా ఓడిపోతాడు. ఆ ఎన్నికలన్నీ ఒక జోక్‌ లాగా చేశాడు దర్శకుడు కృష్ణ చైతన్య. పోనీలే అది జోకు అనుకుంటే మాట్లాడితే ఫ్లాష్‌ బాక్‌ అంటూ వెళుతూ ఉంటాడు, అదేదో కొత్తగా స్క్రీన్‌ప్లే చూపిద్దాం ప్రేక్షకులకి అనుకున్నాడేమో కానీ అది బెడిసికొట్టింది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్‌తో హీరో క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో చూపించాడు.  హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది.అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు?  మాట్లాడితే లంకలో కత్తి కడితే పది తరాల వరకు ఆ పగ పోదు అని చెపుతూ ఉంటాడు. అసలు దర్శకుడు గోదావరిలో పెరిగాను అని చెప్పి గోదావరి నేపథ్యంలో ఇంత దారుణమైన కథ అతని దగ్గర నుండి వచ్చిందని ఎవరూ ఊహించరు. కృష్ణ చైతన్య మంచి రచయిత, దర్శకుడు ఇది అతనికి వచ్చిన గొప్ప అవకాశం. కానీ అతను ఈ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 

ఎవరెలా చేశారంటే.. 

యువ నాయకుడు లంకల రత్నాకర్‌గా విష్వక్‌సేన్‌ తనదైన ముద్ర వేశాడు. తనలోని మాస్‌ కోణానికి తగిన శక్తివంతమైన పాత్ర ఇది. అందుకు తగ్గట్టుగానే హుషారుగా నటించాడు. పోరాటాలు, పాటలపైనా ప్రభావం చూపించారు. అంజలి పాత్ర అర్థవంతంగా ఉంటుంది. ఆ పాత్రపై ఆమె అంతే ప్రభావం చూపించారు. నేహాశెట్టి అందంగా కనిపించింది. కానీ ఆ పాత్ర ప్రయాణంలోనే కొన్ని సమస్యలున్నాయి. నాజర్‌, గోపరాజు రమణ, సాయికుమార్‌, ప్రవీణ్‌, పమ్మి సాయి, హైపర్‌ ఆది తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. గ్యాంగ్స్‌లో కనిపించే పాత్రలూ బలంగా గుర్తుండిపోయేలా ఉంటాయి. సాంకేతిక విభాగాలే ఈ సినిమాకి ప్రధాన బలం. కెమెరా విభాగం అత్యుత్తమ పనితీరుని ప్రదర్శించింది. 90వ దశకం నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రతీ ఫ్రేమ్‌ విలువైనదిగా ఉంటుంది. యువన్‌ శంకర్‌ రాజా నేపథ్యసంగీతం మరో ఆకర్షణ ఈ సినిమాకి. చాలారోజుల తర్వాత తెలుగు సినిమాకు  పని చేయడంతో ఈ సినిమాపై చాలా ప్రభావం చూపించారు. మోత మోగిపోద్ది, సుట్టంలా సూసి పాటలు, చిత్రీకరణ బాగున్నాయి. కళ, కూర్పు తదితర విభాగాల పనితీరు కూడా మెప్పిస్తుంది. రచయితగా కృష్ణచైతన్య ముద్ర ఈ సినిమాపై కనిపిస్తుంది కానీ, ఆయన రచన పరంగానే ఈ సినిమాకి చాలాచోట్ల లోటు చేశారు. తర్వాత ఏం జరుగుతుందనే ఆత్రుత, ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు ఉంటే బాగుండేది. గోదావరిలో ఎరుపు, గోదావరి లంకల్లో ఏడుపు నాతోనే ఆగిపోవాలి... సహా చాలా సంభాషణలు గుర్తుండిపోతాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. రత్న అలియాస్‌ రత్నాకర్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ ఒదిగిపోయాడు.  ఇక అందరూ గోదావరి యాస మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక విశ్వక్‌ సేన్‌ తప్ప. అతను సరిగ్గా హోమ్‌ వర్క్‌ చెయ్యలేదు అనిపిస్తోంది. మొదటి సగం కన్నా రెండో సగం అసలు భరించలేని విధంగా ఉంటుంది. సంగీతం అంతంత మాత్రమే, ఛాయాగ్రహణం పరవాలేదు. సినిమాలో భావోద్వేగాలు అస్సలు కనపడవు. ఏ పాత్రలోనూ, ముఖ్యంగా రత్న పాత్రలో సంఘర్షణ లేదు. ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం.  అక్కడక్కడ ఆయన ఒరిజినల్‌ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్‌ఫుల్‌ పాత్రలో అంజలి చక్కగా నటించింది. బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్‌ సాంగ్‌లో ఆయేషా ఖాన్‌ అందాలతో ఆకట్టుకుంది. విలన్‌గా యాదు పాత్రలో గగన్‌ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్‌, సాయి కుమార్‌ హైపర్‌ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్‌ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !