Private Schools : లో యూనిఫామ్‌, బూట్లు, బెల్ట్‌ అమ్మడం నిషేధం

0

ప్రైవేటు స్కూళ్లలో యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల (రాష్ట్ర, సీబీఎస్సీ, ఐసీఎస్సీ) ప్రాంగణాల్లో యూనిఫారాలు, షూస్‌, బెల్ట్‌ అమ్మడానికి వీల్లేదని పేర్కొన్నారు.కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే.. అవి వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని తెలిపారు. ప్రైవేట్‌ స్కూళ్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో యూనిఫారాలు, షూ, బెల్ట్‌ మొదలైనవాటి క్రయ విక్రయాలు జరుగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !