Raj Tarun : లావణ్యకు డ్రగ్స్‌ అలవాటు ఉంది, బ్రేకప్‌ చెప్పా !

0

రాజ్‌ తరుణ్‌ మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా రాజ్‌ తరుణ్‌ను బుట్టలో వేసుకుందని, తన ప్రియుడిని తనకు కాకుండా చేసిందని ఆరోపించింది. అతడిని వదిలేయకపోతే తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఆరోపణలపై హీరో రాజ్‌ తరుణ్‌ స్పందించాడు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గత ఏడేళ్లగా లావణ్యతో రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమే. మొదట్లో నాతో కలిసున్నాం. నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో నన్ను గైడ్‌ చేసింది. మేము రెండుమూడేళ్లు కలిసున్నాం. అయితే ఆమె అలవాట్లు నచ్చక దూరం పెట్టాను. ఆమె డ్రగ్స్‌కు ఎడిక్ట్‌ అయింది.  డ్రగ్స్‌ తీసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు. నాకేమో డ్రగ్స్‌ వంటివి నచ్చవు. తన అలవాట్లు నచ్చక నేనే బయటకు వెళ్లిపోయాను. తనను అసలు పెళ్లే చేసుకోలేదు. నేను బయటకు వచ్చేశాక అదే గదిలో మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో కలిసుంది. ఎన్నోసార్లు చెప్పి చూశాను. నా మాట వినలేదు. కొన్నాళ్లగా నాకైతే టార్చర్‌ చూపిస్తోంది. అవన్నీ తట్టుకోలేకే ఆమెకు దూరంగా ఉంటున్నా. రిలేషన్‌కు స్వస్తి చెప్పాను. కానీ డబ్బు కోసం నాతో పని చేసేవారందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తోంది. అలా మాల్వీ మల్హోత్రాకు ఫోన్‌ చేసి బెదిరించింది, బూతులు మాట్లాడిరది. అప్పటి నుంచి నన్ను బెదిరించసాగింది. నాతో డైరెక్ట్‌గా మాట్లాడకుండా నా చుట్టూ ఉన్న స్నేహితులను ఇబ్బంది పెడుతుంది. కేసు పెడతానని బెదిరిస్తోంది. దాంతో నేను లీగల్‌గా వెళ్లాలనుకుంటున్న విషయం తెలుసుకుని నాపై కేసు పెట్టింది.  త్వరలో సినిమా రిలీజ్‌కు ఉండడంతో ఈ సినిమాను దెబ్బ తీయాలనే ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. కొన్నేళ్ల క్రితమే నన్ను వదిలేసిన ఆమె ఇప్పుడు నేను కావాలని కోరుకోవడమేంటో అర్థం కావడం లేదు. నన్ను ఎంతగానో వేధించింది. పరువు పోతుందని ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నాను. నేను కూడా తనపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

ఆ పని చేయాల్సింది..

లావణ్య డ్రగ్స్‌ తీసుకుంటుందనే విషయాన్ని ఒక బాధ్యతగ గల హీరోగా నేను పోలీసులకు చెప్పాల్సింది. కానీ నేను నా రిప్యుటేషన్‌  పోతుందని ఆలోచించి ఆ దిశగా అడుగేయలేదు. ఎలాంటి రచ్చ జరుగుతోందోనని భయపడ్డాను. నన్ను చాలాకాలంగా బెదిరిస్తోందనే కారణంతో సైలెంట్‌గా ఉన్నా. లేదంటే నేను ఎప్పుడో పోలీసులు, మీడియా ముందుకు వచ్చేవాడిని. ఆమె నుంచి నాకు, నా స్నేహితులకు ఇబ్బంది ఉంది కానీ.. ఆమె తల్లిదండ్రుల నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమెను పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుందని మనసులో ఉండేది. కానీ నేను ఎప్పుడు ఆ మాట ఆమెతో చెప్పలేదు. బంధం బలపడుతున్న సమయంలో డ్రగ్స్‌ , వేరే వ్యక్తితో రిలేషన్‌ తో పాటు చాలా కారణాల వల్ల నేను ఆమెకు దూరమయ్యా’’ అని చెప్పారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !