VijaySai Reddy : లిక్కర్‌ స్కామ్‌, పోర్ట్‌ వాటాల డీల్‌లో ఉన్నది వారే

0

లిక్కర్‌ కుంభకోణంపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. లిక్కర్‌ స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి రెండూ కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డే అని కుండబద్దలు కొట్టారు. దీని గురించి మరిన్ని వివరాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా అని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ‘‘భయం అనేది నా బ్లెడ్‌లోనే లేదు. ఎవరికీ భయపడే రకం కాదు. గతంలో నాయకుడిపై భక్తి, గౌరవం ఉండేది.. ఇప్పుడు ఆ భక్తి దేవుడి మీద ఉంది. జగన్‌ నాకు పదవులు ఇచ్చాడు కాదనను.. కానీ ఆ పార్టీలో అనేక అవమానాలు పడ్డాను. కోటరీ వల్లే నేను జగన్‌కు దూరమయ్యాను. జగన్‌ మనసులో నాకు చోటు లేదని తెలిసాకే వీడాలని నిర్ణయించుకున్నాను. కోటరీ మాటలు వినొద్దని అనేకసార్లు జగన్‌కు చెప్పాను. అయినా వినలేదు’’ అని విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా, అంతకుముందు ఏపీ సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో ఆయన సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. గత వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌, కాకినాడ సెజ్‌ల్లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనగా, ఇవాళ ఆయన హాజరయ్యారు.

ఈ డీల్‌ మొత్తంలో ఉంది వైవీ విక్రాంత్‌ రెడ్డే 

కాకినాడ పోర్టు వాటాలను బెదిరించి తీసుకున్నారని వ్యాపార వేత్త కేవీరావు ఆరోపించిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు విచారించారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన విచారణలో ఆయన పాల్లొన్నారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ డీల్‌ మొత్తంలో ఉంది వైవీ విక్రాంత్‌ రెడ్డేనని వెల్లడిరచారు. కేవీరావు, వైవీ సుబ్బారెడ్డి అత్యంత అప్తులు అని పేర్కొన్నారు. కేవీరావు అంటే తనకు అసహ్యమని ఆయన చెప్పారు. అమెరికాలో కేవీరావు ఇంట్లోనే వైవీ సుబ్బారెడ్డి ఉంటారని తెలిపారు. తనపై ఆరోపణలు ఎవరు చేయించారో..ఎలా చేశారో అనేది మొత్తం తనకు అర్ధమైందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ కేసు కొనసాగినా తనకు వచ్చిన నష్టమేమీ లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. కేవీరావుతో తాను మాట్లాడలేదని, అలా చేస్తే నిరూపించాలని సవాల్‌ విసిరారు. వాళ్లు ఎదిగేందుకు తనకూ, జగన్‌కు విభేదాలు సృష్టించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇందులో పాత్రదారులు, సూత్రదారులెవరో తనకు తెలసన్నారు. కోటరీ నుంచి వైఎస్‌ జగన్‌ బయటకు రావాలని సూచించారు. అప్పుడే జగన్‌ భవిష్యత్తు బాగుందని తెలిపారు. ఈ ఆరోపణల వెనుక జగన్‌ ప్రమేయం లేదని తాను నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు. తాను జీవితంలో మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనని చెప్పారు. జగన్‌ మనసులో తనకు స్థానం లేదు కాబట్టే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !