కోయంబత్తూరు నుంచి షిరిడీకి సర్వీస్ ప్రారంభం !
దేశంలోనే ప్రప్రథమంగా ప్రైవేటు రైలు సర్వీస్ ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పేరు తో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే తొలి ప్రైవేటు రైలు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు సేలం డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ గౌతమ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది. 5 రోజుల ప్యాకేజీ టూర్ క్రింద ఇందులో ప్రయాణించవచ్చని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 20 బోగీలు కలిగిన ఈ రైలులో తొలి రోజే 1,100 మంది ప్రయాణించారు. బోగీలను ఆధునిక హంగులతో తయారుచేశారు. ఇంకా ఇందులో వైద్యుడు, పోలీసులు, ఏసీ మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది...మరియు రుచికరమైన శాఖాహారాన్ని అందించే ఛెప్‌లు ఇందులో ప్రయాణం చేస్తారు. ఫ్యాకేజీలో భాగంగా వీఐపీ దర్శనం, బస్సువసతులు, ఏసీ రూమ్‌ల్లో వసతి, టూరిస్ట్ గైడ్ల సేవలు అందుబాటులో ఉంటాయి.