మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చిరంజీవి తొలిసారిగా కొంచం వయసు పైబడిన లుక్‌తో కనిపించటంతో పాటు బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చున్న ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది. భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ ఏడాది విజయదశమికి ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.