కేరళ స్టోరీ...విడుదలవుతుందా ? నిషేదానికి గురవుతుందా ?

0

‘కేరళ స్టోరీ’ అనే సినిమా పెద్దఎత్తున వివాదానికి కారణమవుతోంది. కేరళ నుండి సుమారు 32 వేలమంది మహిళల్లో చాలా మందిని మత మార్పిడి చేయించి సిరియా, ఆఫ్ఘనిస్థాన్‌ వంటి ఇస్లామిక్‌ దేశాలకు తరలించారన్న ఇతివృత్తంతో ఈ సినిమాను నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ కాగా అప్పుడే దీనిపై పెద్ద ఎత్తున వివాదం తలెత్తింది.

కేరళ రాష్ట్రాన్ని ఉగ్రవాదులకు ‘స్వర్గధామం’గా చూపే ప్రయత్నం చేశారని ఈ మూవీ యూనిట్‌ పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని కేరళ డీజీపీ అనిల్‌ కాంత్‌.. తిరువనంతపురం పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వీఏ. షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళ నుంచి నిజంగా 32 వేలమంది మహిళలల్లో పలువురిని బలవంతంగా మత మార్పిడి చేయించి ఇస్లామిక్‌ దేశాలకు తరలించారా అన్న విషయాన్ని నిర్ధారించాలని, అసలు ఈ చిత్రాన్ని నిషేధించాలని ఇటీవల ఓ జర్నలిస్టు రాష్ట్ర సెన్సార్‌ బోర్డును కోరారు. ఈ చిత్ర దర్శక నిర్మాతలు తగినన్ని ఆధారాలు చూపాలని కూడా ఆయన తన లేఖలో డిమాండ్‌ చేశారు. ఈ ఫిర్యాదు తాలూకు కాపీని సీఎం పినరయి విజయన్‌కి కూడా పంపగా ఆయన దాన్ని డీజీపీకి ఫార్వార్డ్‌ చేశారు. కేరళ స్టోరీ సినిమా వివిధ వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేట్టుగా ఉందని, దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలిగించేదిగా ఉందని ఆ జర్నలిస్టు ఆరోపించారు.

మరోవైపు పోలీసులు కూడా ఈ చిత్రంలో చూపినట్టు ఆయా సంఘటనలకు ఎలాంటి ఆధారం లేదని, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడానికి, వేర్వేరు మతాల మధ్య వైరుధ్యాలు, ద్వేషాలు పెంచేలా ఉందని అభిప్రాయపడ్డారు. కేరళ నుంచి షాలినీ ఉన్నికృష్ణన్‌ అలియాస్‌ ఫాతిమా బీ అని తనను చెప్పుకున్న ఓ మహిళ ఈ 32 వేలమంది మహిళల్లో తాను ఒకదానినని, మతం మార్చిన తమను ఇస్లామిక్‌ రాజ్యం కోసం పోరాడేందుకు సిరియా, యెమెన్‌ దేశాలకు తరలించారని చెబుతుంది.

నర్సు కాదలచుకున్న తనను తన ఇంటినుంచి బలవంతంగా కిడ్నాప్‌ చేసి.. ఆఫ్ఘనిస్థాన్‌ తరలించారని, అక్కడ ఐసిస్‌ ఉగ్రవాదిగా మార్చారని ఆమె పేర్కొంది. తనలాగా సుమారు 32 వేలమంది మహిళలను ఇలా మార్చినట్టు వెల్లడిరచింది. ఈ పాత్రలో ఆదా శర్మ నటించింది. మరి ఇప్పుడు ఈ సినిమాపై వివాదాలు ఎప్పుడు ముగిసి, రిలీజ్‌కు ఎప్పుడు నోచుకుంటుందో కాలమే చెప్పాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !