ఈసారి పెదకూరపాడులో గెలుపు మాదే...కొమ్మాలపాటి శ్రీధర్‌ !

0


అభివృద్ధిలో వెనుక బడిన రాష్ట్రాన్ని మళ్ళీ జెట్‌స్పీట్‌లో ముందుకు నడిపించాలంటే నారా చంద్రబాబునాయుడిగారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం తప్ప మరో గత్యంతరం లేదని పెదకూరపాడు మాజీ ఎమ్మేల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు. 400 రోజులు, 4000 కి.మీ. పాదయాత్రతో ప్రజలతో మమేకం కానున్నారు. ఆయన పాదయాత్ర విజయవంతం అవుతుందన్నారు. అలాగే పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ ఎమ్మేల్యే అభ్యర్థి విషయంలో ప్రత్యర్థి పార్టీ వారు ప్రజల్లో గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి వేరే అభ్యర్థి వస్తున్నట్లు పుకార్లు పుట్టించి వ్యాప్తి చేస్తున్నారు. ఇది వారు ఆడుతున్న మైండ్‌గేమ్‌. వైసీపీ ట్రాప్‌లో పడొద్దని సూచిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆరునూరైనా, నూరుఆరైనా తెలుగుదేశం ఎమ్యేల్యే అభ్యర్థిగా కొమ్మాలపాటి శ్రీధరే పోటీలో ఉంటారన్నారు. నేను పెదకూరపాడు స్థానికుడిని, 2 సార్లు ఎమ్మేల్యేగా గెలిచిన అనుభవం ఉంది, ఒకసారి ఓటమిని చవిచూసినా నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నవాడిని. ఎప్పుడు ఏ సహాయం కోరి వచ్చినా కాదు అనకుండా చేసేవాడిని. ఈ సారి ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఓ సైనికుడిగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సారి మేము స్పష్టమైన టార్గెట్‌తో ప్రజల్లోకి వెళుతున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూనే, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను, తటస్థులను కలిసి వారిని తెలుగుదేశం వైపు ఆకర్షించటమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. 

వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు !

వైసీపీలో వర్గ విభేదాలతో చాలా మంది పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని గ్రహించి మమ్మల్ని చాలా మంది నాయకులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల అనుమతితోనే వారిని పార్టీలోకి తీసుకుంటాం. వైసీపీ పార్టీ కార్యకర్తలే అధికార పార్టీ నాయకులపై గుర్రుగా ఉన్నారు. ఈ సారి టీడీపీకి భారీ విజయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !