జగన్‌ వ్యాఖ్యలు స్వయంకృతాపరాధమా ?

0


2024 ఎన్నికలలో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి 175 సీట్లు గెలుచుకొంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న జగన్‌ ప్రభుత్వం...మరో వైపు ప్రతిపక్షాలకు ఎక్కడ లేని ఆత్మవిశ్వాసాన్ని, ఆయుధాల్ని చేతులారా అందిస్తున్నారా ? అంటే అవును అని అనుకోవాల్సివస్తోంది. టీడీపీ, జనసేన ఇరు పార్టీలు ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే దమ్ముందా ?  అని జగన్‌ మొన్న తెనాలి సభలో సవాలు విసిరారు. అంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓడిపోతుంది అని పరోక్షంగా ఓటమిని ఒప్పుకున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అసలు ప్రతిపక్షాలు ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకొంటే వైసీపీకి ఎందుకు ?అంటే 175 సీట్లు గెలుచుకొంటామనే నమ్మకం వైసీపీకి లేదన్నది సుస్పష్టం అవుతోంది. పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ టిడిపి, జనసేనలు కలిస్తే వైసీపీ నష్టపోతుందని లోలోన ఆందోళన చెందుతున్నారనే విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఎంత వరకు సమంజసమో జగన్‌కే తెలియాలి. ఈ విషయం రాష్ట్ర ప్రజలు అర్దం చేసుకోలేరనుకోవడం అవివేకమే కదా? అయినా ఒంటరిగా పోటీ చేసి 175 సీట్లు గెలుచుకోగలమని సిఎం జగన్మోహన్‌ రెడ్డి చెప్పుకొంటునప్పుడు అదే విషయాన్ని బలంగా తీసుకెళితే వైసీపీ శ్రేణుల్లోనూ మరింత ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇలా మాట్లాడటం వ్యూహాత్మక తప్పిదమే అవుతోంది.



ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయాలనే ఆలోచన జగనే ఇచ్చినట్లు అవుతోందనే వాదన వినబడుతోంది. అలా కాకుండా మరి కొన్ని కొత్త పథకాల ద్వారా మరింతగా ఓటు బ్యాంకును స్థిరికరించుకునే వ్యూహమో లేక ఏ ఏ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకోవటం, మందు రేట్లు భారీగా తగ్గించటం, ఇసుకను అందరికీ అందుబాటులోకి తేవటం వంటి కార్యక్రమాల ద్వారా జనంలోకి నేరుగా వెళ్ళవచ్చు అనేది జనాభిప్రాయంగా వినిపిస్తోంది. కనుక టిడిపి, జనసేనల పొత్తుల గురించి సిఎం జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపీ నేతలు పదేపదే మాట్లాడుతుండటం, వాటిని వేర్వేరుగా 175 సీట్లకు పోటీ చేయాలంటూ సవాళ్ళు విసరడం వలన ప్రజలకు వైసీపీ తప్పుడు సంకేతాలు పంపిస్తున్నట్లే అవుతోందని చెప్పవచ్చు. చివరికి ఈ వాదన వైసీపీ స్వయకృతాపరాధంగా మారినా ఆశ్చర్యం లేదు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేలా జాగ్రత్త పడతామని పవన్‌ కళ్యాణ్‌ పదేపదే బహిరంగ వేదికలపై చెపుతున్నారు. టిడిపి, జనసేనలు కలిసి పనిచేస్తాయని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ తమ చేతల ద్వారా చెబుతున్నారు. వారి వ్యూహానికి తప్ప ప్రతి వ్యూహం పన్ని వారి ఓటు బ్యాంకును తమ వైపు మళ్ళించుకునే ప్రయత్నాలు ఆరంభించాలి కానీ టీడీపీ, జనసేన వ్యూహంలో చిక్కుకోకూడదు వైసీపీ శ్రేణుల నుండి వినిపిస్తోంది.  ఆ రెండు పార్టీలని దూరంగా ఉంచడానికి వైసీపీ నాయకులు చేస్తున్న వాదనలు, విసురుతున్న సవాళ్ళు నిత్యం రాష్ట్ర ప్రజలందరూ వింటూనే ఉన్నారు. అయితే ఆ ప్రయత్నంలో వైసీపీ తన అభద్రతాభావాన్ని పదేపదే బయటపెట్టుకొంటున్నట్లు అవుతోంది తప్ప తమ వాదనలతో వాటిని దూరంగా ఉంచలేకపోతున్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !