Twitter logo changed: ట్విటర్‌ లోగో మార్పును దృవీకరించిన ఎలాన్‌మస్క్‌ !

0

ట్విటర్‌ లోగో (Twitter logo changed) మారిపోయింది. ఇప్పటి వరకు ఉన్న  ‘బ్లూ బర్డ్‌’  (Blue Bird ) ఎగిరిపోయింది ! ఆ స్థానంలో క్రిప్టో కరెన్సీ అయిన ‘డోజీకాయిన్‌’ (Doge Coin) కు సంబంధించిన డోజీ మీమ్‌ను ఉంచారు. మంగళవారం ఉదయం నుండే ట్విటర్‌ (Twitter logo changed ) యూజర్లకు ఈ కొత్త లోగో దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని దృవీకరిస్తూ ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ట్వీట్‌ చేశారు.  ట్విటర్‌ (Twitter logo changed)...సోషల్‌ మీడియా మినీ బ్లాగ్‌ యాప్‌. దీనిని కోట్ల మంది వాడుతున్నారు. తాము అనుకున్నది పరిమిత పదాలతో చెప్పేందుకు ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ తోడ్పడుతుంది. స్టార్లు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, సంస్థలు తమ అభిమానులు, ఫాలోవర్స్‌కి సమాచారం చేరవేయడానికి కూడా ఈ ట్విట్టర్‌ ని వాడుతుంటారు. ప్రపంచ అబర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ (Elon Musk) ట్విట్టర్‌ ని కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితులు చాలా మారాయి. ఉద్యోగుల తొలగింపు, కార్యాలయాల మూసివేత అంటా చాలానే జరిగాయి. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్‌ లోగోనే (Twitter logo changed )మారిపోయింది. అవును.. ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ లోగోనే మార్చేశారు.


కొత్త లోగో షిబాఇనూ శునకం !

బ్లూ బర్డ్‌ ఇక పాతదని.. ఇకపై ఈ డోజీ మీమే కొత్త లోగో అని ఉన్న ఓ మీమ్‌ను ట్వీట్‌ చేశారు. అలాగే 2022 మార్చి 26న ఓ ట్విటర్‌ యూజర్‌తో జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఈ సందర్భంగా మస్క్‌ పంచుకున్నారు. అందులో సదరు యూజర్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసి ‘డోజీ’ని లోగోగా పెట్టాలని సూచించడం గమనార్హం. దీనికి మస్క్‌ అప్పట్లో సానుకూలంగా స్పందించారు. తాజాగా ఆ సంభాషణను గుర్తు చేస్తూ.. ‘ఇచ్చిన మాట ప్రకారం..’ మార్పు చేసినట్లు పేర్కొన్నారు. మరి ఈ కొత్త లోగో శాశ్వతమా లేక కొన్నాళ్ల తర్వాత మారుస్తారా అనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అయితే, కొంత మందికి ఈ లోగో కేవలం ట్విటర్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మాత్రమే మారింది. మొబైల్‌/యాప్‌లో మాత్రం ఇంకా బ్లూ బర్డ్‌ లోగోనే కనిపిస్తోంది. ‘షిబా ఇనూ’ అనే జపాన్‌ జాతి శునకం చిత్రాన్నే డోజీగా వ్యవహరిస్తుంటారు. 2013లో తొలిసారి డోజీకాయిన్‌ క్రిప్టోకరెన్సీకి, దానికి వెనక ఉండే బ్లాక్‌చైన్‌ సాంకేతికతకు సరదాగా ఈ డోజీని లోగోగా క్రియేట్‌ చేశారు.ఈ కుక్క లోగో వెనక  ఓ బలమైన కారణం ఉంది. ట్విట్టర్ అధినేత  ఎలోన్ మస్క్ చాలా కాలంగా ణశీస్త్రవషశీఱఅ క్రిప్టో కరెన్సీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సాహం అందిస్తున్నారు. అంతేకాదు తన మైక్రో-బ్లాగింగ్ ట్విట్టర్ లో క్రిప్టోకరెన్సీని ప్రోత్సహించడం గమనార్హం. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !