Anasuya Bharadwaj Special Post For Her Husband : డైరెక్టర్లకు అనసూయ ఓపెన్‌ ఆఫర్‌ ?

0

సినీ నటి అనసూయ ఇటీవల బికినీలో అద్భుతమైన ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఊహించినట్లుగానే, ఈ ఫోటోలు చాలా త్వరగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి, అనసూయ తన సోషల్‌ మీడియా లో ఆకర్షణీయమైన ఫోటోలను షేర్‌ చేస్తున్నందున అభిమానులు ఆమె తదుపరి ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాంకర్‌గా తన కెరీర్‌తో పాటు, వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనసూయ ఇప్పుడు వెండితెరపై తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవలే ‘‘రంగమార్తాండ’’ చిత్రంలో కనిపించిన ఆమె ప్రస్తుతం ‘‘పుష్ప 2’’ చిత్రంలో నటిస్తోంది.అనసూయ తన పాత్రల ఎంపికలో, తన ప్రాధాన్యతలకు తగ్గట్టుగా అవకాశాలను అంగీకరిస్తోంది. ఆ పాత్ర తనకు నచ్చితే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలను తీసుకోవడానికి ఆమె వెనుకాడదు. ఆమె తన గ్లామరస్‌ వైపు ప్రదర్శిస్తూ, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ప్రెజెన్స్‌ను కొనసాగిస్తూనే, అనసూయ తన కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని కూడా ఆదరిస్తుంది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి థాయిలాండ్‌ పర్యటనతో సహా వరుస సెలవులు మరియు పర్యటనలను ఆస్వాదిస్తోంది. ఆమె బికినీ ఫోటోలతో సహా బీచ్‌లో వారి రొమాంటిక్‌ మూమెంట్స్‌ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ సెన్సేషన్‌గా మారాయి. ఈరోజు తన పెళ్లిరోజు సందర్భంగా ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. తన భర్త భరద్వాజ్‌ గురించి.. తనతో ప్రేమ, పెళ్లిపై మనసులోని భావాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరలవుతోంది.

నీపై నాకున్న ప్రేమ

భర్తతో కలిసి బీచ్‌లో ఉన్న వీడియో షేర్‌ చేసిన అనసూయ..‘‘2001లో నువ్వు నాకోసం రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నీకు రిప్లై ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు నీపై నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాను.. ఇన్నేళ్ల మన జీవితంలో ఎంతోమంది నిన్ను ఎన్నో మాటలు అన్నారు. వాటిని పట్టించుకోకుండా నాపై ఇంత ప్రేమ చూపుతున్నావు. మన వివాహబంధాన్ని ఎంతో అద్భుతంగా నిలబెడుతున్నావు. ఇప్పటి వరకు నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు. ఒక్కోసారి నువ్వు నాపై చూపించే ప్రేమకు, నీ సహనానికి నేను కూడా ఆశ్చర్యపోతుంటాను. మనమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ పైకి ఎదుగుతున్నాం. మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదని నాకు తెలుసు.. కానీ కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడుంటున్నాం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం. నన్ను నన్నుగా స్వాగతించినందుకు ధన్యవాదాలు’’అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను తెలిపింది. ఇక ఈ పోస్ట్‌ చూసిన వారంతా అనసూయకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సినిమాల్లో బికినీలకు సిద్ధమేనా ? 

భర్తతో కలిసి బికినీతో పాటు లిప్‌లాక్‌తో దర్శనం ఇచ్చిన అనసూయ తరువాత సినిమాల్లో క్యారెక్టర్‌ డిమాండ్‌ని బట్టి బికినీలు ధరించడానికి సిద్ధమేనా అని  కొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ ఫోటోలతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనే అనుకోవచ్చు అని ఈ విషయం కరెక్ట్‌ అయితే వెండితెరపై అనసూయకు ఆఫర్ల వెల్లువ కొనసాగుతుందని చెప్పక తప్పదు. ఇక డైరెక్టర్లు అనసూయ కోసం ప్రత్యేకమైన క్యారెక్టర్లు సృష్టిస్తారేమో చూడాలి. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !