ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప `1లో ఓ రేంజ్ ఫెర్మామెన్స్‌తో ఇరగదీసిన జాలిరెడ్డి (ధనుంజయ) మరోసారి తన టాలెంట్‌ను పీక్స్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. విరిగిపోయి నడుమును బాగు చేయించుకునే క్రమంలో కేరళ వైద్యంతో మర్థన చేయించుకుంటూ శ్రీవల్లీ మీద కసితో రగిలిపోతుంటాడు. రోజురోజుకి బలాన్ని కూడదీసుకుంటూ శ్రీవల్లీని అనుభవించటమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా విపరీతంగా ప్రవర్తిస్తాడు. పుష్ప అడవిలో కనిపించకుండా పోయిన సందర్భంలో జాలిరెడ్డి మళ్ళీ ఎర్రచందనం కూలీలతో కొట్టించి లారీల్లో సరుకు రవాణా చేసే వ్యాపారం కొనసాగిస్తుంటాడు. అనసూయ ఎమ్మేల్యే కావటంతో సునీల్ మళ్ళీ యాక్టివేట్ అవుతాడు. జాలిరెడ్డి కూడా ఎర్రచందనాన్ని సునీల్‌కి పంపిస్తుంటాడు. శ్రీవల్లీ శ్రీమంతం ఫంక్షన్‌లో అందరినీ భయపెట్టి జనాన్ని పంపేసి, బలవంతంగా అనుభవించబోయే సమయంలో శ్రీవల్లీ చేతులో దారుణంగా చనిపోయే పాత్రలో అద్భుతంగా తన పాత్రను పండిరచబోతున్నాడు ధనుంజయ.
పుష్ప లో నటించిన విలన్స్.. వేరే భాషల్లో స్టార్ హీరోస్ అని అందరికి తెల్సిందే. షెకావత్ గా నటించింది మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కాగా .. జాలిరెడ్డిగా నటించింది కన్నడ హీరో ధనుంజయ. కథ, పాత్ర నచ్చడంతో మారు మాట్లాడకుండా వీరు ఈ సినిమాలో నటించారు. ఇక పుష్ప 2 లో కూడా వీరి పాత్రలను సుకుమార్ ఓ రేంజ్ లో మలుస్తున్నాడు. ఇప్పటికే ఫహద్ పుట్టినరోజున ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపిన మేకర్స్ తాజాగా నేడు ధనుంజయ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ’’ ట్యాలెంటెడ్ నటుడు ధనుంజయ కు పుష్ప 2 టీమ్ బర్త్ పే విషెస్ తెలుపుతుంది.. ఈసారి స్కోర్‌లను పరిష్కరించేందుకు జాలీ రెడ్డి తిరిగి రానున్నారు’’ అని చెప్పుకొచ్చింది.
Team #Pushpa2TheRule wishes the talented @Dhananjayaka a very Happy Birthday ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 23, 2023
Jolly Reddy will be back to settle the scores this time 💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP #FahadhFaasil @SukumarWritings @PushpaMovie @TSeries pic.twitter.com/pw8MkpvdvD