AP HIGH COURT : రాజధాని అసైన్డ్‌ భూముల కేసు రీఓపెన్‌ !

0

అమరావతి అసైన్డ్‌ భూముల (Amaravati Assignments Lands)  కేసు వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. కొత్త ఆధారాలను పరిగణనలోకి తీసుకుని విచారించాలని సీఐడీ (CID) దాఖలు చేసిన పటిషన్‌పై నేడు రాష్ట్ర హైకోర్టులో (AP HIGH COURT) విచారణ జరిగింది. సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది. కేసు రీఓపెన్‌కు (Reopen) అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్‌ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ పిటీషన్‌పై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. వేరే కేసులో ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని న్యాయవాదులు ప్రశ్నించారు. 

కృష్ణప్రియ చేసిన వ్యాఖ్యలు కీలకం

ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి కొన్ని ఆడియో ఫైల్స్‌ను (Audio Files) అందించారు. మంగళవారం (అక్టోబర్‌ 17న) మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని సీఐడీ (CID) తెలిపింది. అనంతరం విచారణను వచ్చే నవంబర్‌ 1కి హైకోర్టు వాయిదా వేసింది. అసైన్డ్‌ భూముల కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. అయితే ఈ కేసులో మరో నలుగురి పేర్లను కొత్తగా చేర్చామని, రీఓపెన్‌ చేయాలని ఇటీవల సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే.మాజీ మంత్రి నారాయణ కి సంబంధించిన ఆధారాలపైన తాజాగా ఆయన మరదలు కృష్ణప్రియ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అసైన్డ్‌ భూముల వ్యవహారంలో నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు, లావాదేవీలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో ఈ కేసు తిరిగి విచారణ విషయంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.. సిఐడి వద్ద ఉన్న ఆధారాలు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !