బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన సినిమాలో కాజల్ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వరంగల్‌లో ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించింది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈవెంట్ కి బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది వచ్చి సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్లో బాలకృష్ణ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి, అభిమానుల గురించి మాట్లాడారు. అనంతరం సినిమాలకు ప్రభుత్వాలు సహకరించాలని వ్యాఖ్యలు చేశారు.బాలకృష్ణ మాట్లాడుతూ.. కరోనా తర్వాత థియేటర్లకు ప్రజలు వస్తారో రారో అన్న ఆలోచనలో ఉన్నారు అందరూ. ఆ సమయంలోనే అఖండ సినిమా రిలీజ్ చేశాము. కానీ అప్పుడు ప్రభుత్వాలు మాకు సహకరించలేదు. ఎక్స్ ట్రా షోలు లేవు, రేట్లు పెంచలేదు. అయినా రిలీజ్ చేసి హిట్ కొట్టాము. రికార్డ్స్ సృష్టించాము. ఆదాయం వచ్చేదాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. సినిమాల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయి. గుర్తించి సినిమాలకు సహకరించాలి అని అన్నారు. దీంతో బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆలస్యమెందుకు ‘భగవంత్ కేసరి’ యాక్షన్ మీరూ చూసేయండి..