TeluguDesam Party : ఏపీ హేట్స్‌ జగన్‌...తెలుగుదేశం కౌంటర్‌ అటాక్‌ !

0

 

వై ఏపీ నీడ్స్‌ జగన్‌ క్యాంపెయినింగ్‌కు కౌంటర్‌ క్యాంపెయిన్‌ను టీడీపీ ప్రారంభించింది. ఏపీ హేట్స్‌ జగన్‌ పేరుతో కౌంటర్‌ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టారు. జగన్‌ను ఏపీ ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. సోషల్‌ మీడియాలో కూడా ఏపీ హేట్స్‌ జగన్‌ అనే హ్యాష్‌ ట్యాగుతో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంస్‌పై తెలుగుదేశం ప్రచారం చేపట్టనుంది. 

ఏపీ హేట్స్‌ జగన్‌

ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ... ఏపీ నీడ్స్‌ జగన్‌ కాదు.. ఏపీ హేట్స్‌ జగన్‌ అని అన్నారు. వద్దు బాబోయ్‌ జగన్‌ అని ప్రజలు అంటున్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నందుకు ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రతినిధుల సభలో జగన్‌ మాట్లాడిన ప్రతీ మాట పచ్చి అబద్దమన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసిన జగన్‌.. మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. నవరత్నాల్లో ఏ రత్నమైనా నూటికి 10-15 మందికి మాత్రమే దక్కాయన్నారు. రూ. 10 లక్షల కోట్ల మేర తెచ్చిన అప్పులేమయ్యాయని ప్రశ్నించారు. రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులను డీబీటీల రూపంలో ఇచ్చానని చెబుతున్నారని.. మిగిలిన రూ. 7 లక్షల కోట్లపై నిధులేమయ్యాయని నిలదీశారు. రూ.7 లక్షల కోట్ల నిధులు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్నారు. వైద్య, విద్య రంగాలను జగన్‌ సర్వనాశనం చేశారని విమర్శించారు. అన్ని నాశనం చేసిన జగన్‌ ఇంకెందుకని అడుగుతున్నారన్నారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు అడ్డుకుంటున్నారని.. బస్సు యాత్ర చేస్తున్నారా అని అడిగారు. దళితుడ్ని చంపిన అనంతబాబును పక్కన కూర్చొబెట్టుకున్న జగన్‌.. దళిత పక్షపాతా అంటూ బోండా ఉమా ప్రశ్నించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !