Higher Education : దేశంలోని ఉన్నత విద్యకు ఒకే వేదిక.. త్వరలో పార్లమెంట్‌ ముందుకు !

0

ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో ఉన్నత విద్యను ఒక తాటి కిందకు తెచ్చి ఏకైక నియంత్రణా సంస్థ పరిధిలో ఉంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా HECI బిల్లును పార్లమెంట్‌ ముందుకు తెస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడిరచారు. మెడికల్‌, లా కాలేజీలు మినహా దేశంలోని అన్ని కళాశాలలు ఈ రెగ్యులేటర్‌ పరిధిలో ఉంటాయని తెలిపారు. నియంత్రణ, అక్రిడిటేషన్‌, వృత్తిపరమైన ప్రమాణాలు నెలకొల్పడం అనే మూడు ప్రధాన పాత్రలను ఈ HECI పోషించనుంది. జాతీయ విద్యా విధానంలో HECI ఏర్పాటును ప్రతిపాదించడం జరిగింది. ఇది ఆచరణలోకి వస్తే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు రద్దవుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచింది.  ఈ  HECI లో ఛైర్మన్‌ సహ 14 మంది సభ్యులు ఉంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !