Nara Bhuvaneswari : నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి భువనేశ్వరి !

0

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ‘నిజం గెలవాలి’ పేరుతో పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు ఉండేలా పార్టీ వర్గాలు ప్రణాళిక సిద్ధం చేశాయి. 

భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో నారా లోకేష్‌

చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జనంలోకి వెళ్లనున్నారు. యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన లోకేశ్‌.. చంద్రబాబు జైలు నుంచి రాగానే పాదయాత్రను కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. అప్పటివరకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేశ్‌ చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !