Bhatti : 78 కి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తోంది

0

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించబోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మధిరలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను రత్నం అని నమ్మి పదేళ్లు అధికారమిచ్చిన ప్రజలు రాయిని నెత్తిన పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్‌కు 20 సీట్లు వస్తాయని అనుకుంటే కేసీఆర్‌ కాకిలాగా ఎందుకు తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. వంద మంది కేసీఆర్‌లు వచ్చినా మధిర ప్రజలను కొనలేరని అన్నారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలని, వాటిని జనం నమ్మడం మానేశారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

మళ్లీ ఫ్యూడల్‌ వ్యవస్థ...

కేసీఆర్‌ వచ్చాక మళ్లీ ఫ్యూడల్‌ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అందరికీ ఇళ్లు, అందరికీ భూములు అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తాను కేసీఆర్‌లాగా ఫాం హౌస్‌ లో పడుకోలేదని భట్టి అన్నారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్‌ ఇచ్చేది ఇందిరమ్మ రాజ్యంలోనేనని ఆయన అన్నారు. 78 స్థానాలకు పైగా కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలవబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ గజ్వేల్‌లో గెలవలేనని తెలిసే... కామారెడ్డికి వెళ్లారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !