Kollapur : బర్రెలక్కకు భద్రత ఇవ్వండి -హైకోర్టు ఆదేశం !

0

కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్‌ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష. సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయిన బర్రెలక్క.. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగటంతో.. అటెన్షన్‌ పెరిగింది. ఈ క్రమంలోనే బర్రెలక్క తమ్ముడిపై కొందరు వ్యక్తులు దాడి చేయటం సంచలనంగా మారింది. పోలీసులు భద్రత ఇవ్వటం లేదంటూ హైకోర్టులో పిటీషన్‌ వేశారామె. అంతే కాకుండా ప్రచారం చేయొద్దని.. పోటీ నుంచి తప్పుకోవాలంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నట్లు కోర్టుకు వెళ్లారామె.  పిటీషన్‌ పై విచారణ చేసిన హైకోర్టు.. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్క అలియాస్‌ శిరీష కుటుంబం మొత్తానికి భద్రత కల్పించాలని పోలీసులను  హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎలక్షన్‌ కమిషన్‌ కు కూడా సమాచారం ఇచ్చింది. బర్రెలక్క శిరీష్‌ ప్రచారం చేసే సమయంలోనూ రక్షణ ఇవ్వాలని.. ఎన్నికలు పూర్తయ్యే వరకు అభ్యర్థి భద్రత పోలీస్‌ శాఖ బాధ్యత అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఈసీకి, పోలీసులకు కోర్టు పలు సూచనలు చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని... థ్రెట్‌ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలని సూచించింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌ దే అని స్పష్టం చేసింది. పోలీసులు కేవలం కార్లు చెక్‌ చేస్తాం అంటే కుదరదని పేర్కొంది. బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని హైకోర్ట్‌ ఆదేశించింది. అయితే బర్రెలక్కకు 2+2 భద్రత కేటాయించాలని పిటిషనర్‌ కోరిన విషయం తెలిసిందే. కానీ హైకోర్టు బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని ఆదేశించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !