Nayanatara : స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించిన..నయనతార !

0

సౌతిండియా​ లేడీ సూపర్‌​స్టార్‌ నయనతార.. రీసెంట్‌​గా ‘జవాన్‌’ సినిమాలో తళుక్కున మెరిసింది. దీంతో ఆమె బాలీవుడ్‌​లోనూ తన మార్క్‌ చూపించింది. అయితే ఒకప్పుడు మలయాళ ఛానెల్‌​లో ఒక యాంకర్‌​గా పనిచేసిన నయన్‌.. ప్రస్తుత టాప్‌​ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. నయనతార 39 వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె జీవన ప్రస్థానం గురించి కొన్ని విషయాలు...

మోడలింగ్‌ వైపు అడుగులు

నయనతార అసలు పేరు డయానా మరియన్‌ కురియమ్‌. ఆమె బెంగళూరులో జన్మించారు. కానీ ఆమె స్వస్థలం కేరళ.. తల్లిదండ్రులు కురియన్‌ కొడియట్టు, ఓమన్‌ కురియన్‌. . నయన్‌ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు.  కేరళలో ఇంగ్లిషు లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసిన నయన్‌ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్‌ వైపు అడుగులు వేశాంరు. అలా కెరియర్‌ ప్రారంభంలో టీవీ యాంకర్‌గా కూడా పనిచేశారు. కెరీర్‌​ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆమె.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి చాలా కష్టపడిరది. ‘మనసినక్కరే’ సినిమాతో 2003లో అరంగేట్రం చేసిందీ ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా డైరెక్టర్‌ సత్యన్‌.. ఆమెకు నయనతార అని స్ట్రీన్‌​నేమ్‌ ఇచ్చారు. తర్వాత ఇదే పేరును ఆమె కంటిన్యూ చేసింది. కానీ, ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడం వల్ల.. ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.కెరీర్‌​లో ఎత్తుపల్లాలు ఉన్న సమయంలో నయనతారకు డైరెక్టర్‌ మురుగదాస్‌.. ‘గజిని’ సినిమా ఛాన్స్‌ ఇచ్చారు. ఈ సినిమాలో నయన్‌ సెకండ్‌ హీరోయిన్‌​గా కనిపించింది. అంతే ఆమె లైఫ్‌ అక్కడి నుంచి మంచి టర్న్‌ తీసుకుంది. ఈ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘చంద్రముఖి’ సినిమాతో గుర్తింపు రావడంతో ఆమెకు టాలీవుడ్‌లో ‘లక్ష్మీ’లో ఛాన్స్‌ దక్కింది. తెలుగులో ‘బాస్‌’, ‘యోగి’, ‘లక్ష్మి’, ‘తులసి’, ‘దుబాయ్‌ శీను’, ‘సింహ’, ‘గ్రీకువీరుడు’, ‘అదుర్స్‌​’ ఇలా సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా ‘డోరా’, ‘కర్తవ్యం’, ‘ఐరా’ ఇలా లేడి ఓరియెంటేటెడ్‌ సినిమాల్లోనూ రాణించి నటిగా సక్సెస్‌​ అయ్యింది. తెలుగులో రీసెంట్‌​గా మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలో నటించింది.

వారిద్దరితో ప్రేమ.. ఆ గాయాలను తట్టుకుని

సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ నయనతార వార్తల్లో నిలిచింది. మొదట్లో వల్లవన్‌ షూటింగ్‌ సమయంలో ఆ సినిమా డైరెక్టర్‌, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్‌ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడిరచింది. ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చిచెప్పేసింది. తర్వాత ‘విల్లు’ షూటింగ్‌ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు. అలా పెళ్లి కోసం సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టింది నయన్‌. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార.

తన ప్రేమ గురించి నయనతార ఏమన్నారంటే..?

ఒక ఇంటర్వ్యూలో నయన్‌ మాట్లాడుతూ తాను రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని స్వయంగా నయన్‌ ఇలా చెప్పింది. ‘నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఆ ఇద్దరికీ నాకూ మధ్య అపార్థాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరిమీద ఒకరికి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిగా ఉంటేనే మంచిది అనుకున్నాం. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఎంత కష్టం అయినా పడతాను. అలాంటిది నా ప్రేమ ఫెయిల్‌ అయినప్పుడు ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డా. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చా.. ఆ సమయంలో సినిమాలే నన్ను తిరిగి బలంగా నిలబెట్టాయి. నాలో ధైర్యాన్ని నింపాయి.’ అని నయన్‌ అన్నారు. అలా ప్రేమ గాయాలను తట్టుకుని కొంత కాలం తర్వాత  దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను ప్రేమించి  2022 జూన్‌ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్‌, ఉలగం ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !