తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను సీఎం స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నుంచి ప్రజాదర్బార్‌ను ప్రారంభించనున్నట్లు గురువారం తన ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ప్రజాభవన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు.
స్వయంగా వినతులు స్వీకరిస్తున్న సిఎం
సీఎం రేవంత్‌ను కలిసి సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు పోటెత్తారు. వారి నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్ వారికి భరోసా ఇస్తున్నారు. ప్రజా దర్బార్‌లో సీఎం జగన్‌ను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని బాధితులు సిఎంకు వివరించారు. ఇక, ప్రజా దర్బార్‌కు ప్రత్యేక యంత్రాగాన్ని నియమించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20 మంది సిబ్బంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్స్ చేయాల్సిందిగా సీఎం రేవంత్ ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులపై మళ్లీ సమీక్ష చేయాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్. ప్రతీ నెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సచివాలయానికి వెళ్లనున్నారు. విద్యుత్‌శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.
జనం కష్టాలు వింటూ…
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
కన్నీళ్లు తుడుస్తూ
తొలి ప్రజా దర్బార్ సాగింది.
జనం నుండి ఎదిగి…
ఆ జనం గుండె చప్పుడు విని…
వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!#TelanganaPrajaPrabhutwam pic.twitter.com/E71r3lYlur