ట్రోలింగ్ మరో ప్రాణాన్ని బలితీసుకుంది. కొద్దిపాటి నిర్లక్ష్యాన్ని సాకుగా చూపి విపరీత పోస్టులతో వేధించి.. వేధించి గృహిణిని పీక్కుతిన్నాయి. గత నెలలో చెన్నైలోని అపార్ట్‌మెంట్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి అనుకోకుండా అమ్మ చంకలోని పాప జారిపోయి.. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదున్న రేకులపై పడ్డాడు. మెల్ల మెల్లగా కిందకు జారిపోసాగింది. దీంతో ఆ చిన్నారిని కాపాడేందుకు అపార్ట్‌మెంట్ వాసులు ప్రయత్నించారు. ఆ పాప కిందపడితే ఎటువంటి గాయం కాకుండా ఉండేందుకు కొందరు కింద బెడ్‌షీట్‌లు పరిచి నిలబడ్డారు. మరికొందరు మొదటి అంతస్తు బాల్కనీలోకి వెళ్లి ఆ పిల్లాడ్ని కాపాడే ప్రయత్నం చేశారు. చివరికి ఒక వ్యక్తి ఆ పసికందుని ఒడుపుగా పట్టుకొని కిందకు దించడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాపను సేవ్ చేసిన వ్యక్తిని అందరూ అభినందించారు. ఈ క్రమంలోనే పాప తల్లి రమ్య నిర్లక్ష్యంగా వ్యహరించిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె బిడ్డను ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటుందని, అది అనుకోకుండా జరిగిన ప్రమాదమేనని ఇరుగుపొరుగు వారు స్పష్టంగా చెప్పారు. అయినా ట్రోలర్స్ చల్లబడలేదు. ఆమె కుంగిపోయేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టసాగారు. ట్రోలింగ్‌ని అందరూ ఒకేలా తీసుకోలేరు, కొందరు సెన్సిటివ్‌గా ఉంటారు. ఇదీ కచ్చితంగా ట్రోలర్స్ చేసిన హత్యే. ప్రతి ట్రోలర్ దీనికి బాధ్యత వహించాల్సిందే. చిన్న అంశాన్ని బూతద్ధంలో చూపి ఇష్టానికి కామెంట్ల రూపంలో విరుచుకపడటం సామూహిక దాడి, హత్య క్రిందికే వస్తుంది. బిడ్డను తల్లిని నిజంగానే విడదీశారు ట్రోలర్స్. దీంతో తీవ్ర నైరాశ్యానికి లోనైన బాబు తల్లి రమ్య.. ఆత్మహత్య చేసుకుని తవును చాలించింది. ఆదివారం తన పుట్టింట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న రమ్యను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.