Kethireddy : పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి...ఇదేం ట్విస్ట్‌ !

0

ఏపీలో ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్ల వెనక కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్లు దాడి చేశారంటూ నిన్నా మొన్నటి వరకు అనుకున్నారు అందరూ.. టీడీపీ వాళ్లు దాడి చేసి ఉంటే ఉండొచ్చు ఏమోకానీ.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి.. తలుపులు పగలగొట్టింది.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది పోలీసులే కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. 

అల్లర్లకు పోలీసులే కారణం అనే టాక్‌

ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వచ్చిన వందల మంది పోలీసులు.. ఆయన ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇంట్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారనే సమాచారంలో ఇలా చేసి ఉంటారని వారు భావించవచ్చు. అయితే సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు  తమ లాఠీలతో పగలగొట్టిన విజువల్స్‌ సంచలనంగా మారాయి. రాయలసీమలో అల్లర్లకు పోలీసులే కారణం అనే టాక్‌.. ఈ వీడియో తర్వాత బలంగా వినిపిస్తుంది. పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు సంబంధించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, పెద్దారెడ్డిలు సీసీ కెమెరా విజువల్స్‌ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించటంతో ఇది వెలుగులోకి వచ్చింది. పోలింగ్‌ జరుగుతున్న మే 13వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. ఇక పోలింగ్‌ ముగిసిన తర్వాత విధ్వంసం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి టార్గెట్‌గా పోలీసులే రౌడీల్లా వ్యవహరించారని.. పోలీసుల కనుసన్నల్లోనూ రాయలసీమలో అల్లర్లు చెలరేగాయంటూ.. బయటకు వచ్చిన సీసీ కెమెరా వీడియోలే సాక్ష్యంగా వైసీపీ ఆరోపిస్తుంది. ఇంటి తలుపులు అయితే పగలగొట్టారు అంత వరకు ఓకే.. పోలీసులు సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలపైనే ఇప్పుడు ఈసీ సైతం విచారణ చేయబోతుంది. 


అల్లర్లపై సిట్‌ దర్యాప్తు

పల్నాడు, సీమలో అల్లర్లపై సిట్‌ దర్యాప్తునకు ఆదేశించింది ఎన్నికల సంఘం.. సిట్‌ విచారణలో పోలీసుల వ్యవహారంపై మరిన్ని ఆధారాలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి విజువల్స్‌ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్‌గా మారాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్‌సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు. పోలీసుల దాష్టీకంపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్‌ బర్దర్‌పై ఈసీ సస్పెన్షన్‌ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్సార్‌సీపీ లీగల్‌ తప్పుబట్టింది. తాడిపత్రిలో పోలీసులఅరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !