#Darling Prabhas : మరోసారి వార్తల్లో ప్రభాస్‌ పెళ్ళి...వైరల్‌ న్యూస్‌ !

0

హీరో ప్రభాస్‌ ఇన్‌ స్ట్రాలో ఓ పోస్ట్‌ చేశారు.. అందులో అర్థం మాత్రం వెరీ వెరీ డిఫరెంట్‌గా ఉంది.. సినిమాల గురించి అయితే పర్సనల్‌ టచ్‌ ఉండదు కదా అంటున్నారు ఫ్యాన్స్‌. ఇంతకీ ప్రభాస్‌ పోస్ట్‌ సారాంశం ఏంటో తెలుసా..  డార్లింగ్స్‌.. మా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు.. వెయింట్‌ చేయండి అని ప్రభాస్‌ చెప్పాడు. దీంతో కాబోయే భార్యను పరిచయం చేస్తాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్‌ పెళ్లి గురించి గతంలోనూ అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు స్వయంగా ప్రభాసే స్టేటస్‌ పెట్టడంతో దీనిపై మరిన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్‌ ది లవ్‌ మ్యారేజా? అరేంజ్‌ మ్యారేజా? వంటి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభాస్‌ పెట్టకున్న స్టేటస్‌ తప్పకుండా పెళ్లి గురించే అయుండొచ్చన్న ఆసక్తి నెలకొంది. అమ్మాయి ఎవరు? అని ఫ్యాన్స్‌ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు ? 

దీనిపై క్లారిటీ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌ నటించిన కల్కి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ పెట్టిన స్టేటస్‌ ఈ సినిమాకు సంబంధించిందన్న ప్రచారమూ జరుగుతోంది.ప్రభాస్‌ బాహుబలి సినిమాతో గ్లోబల్‌ స్టార్‌ గా ఎదిగాడు. దీంతో ప్రభాస్‌ పెళ్లిపై టాలీవుడ్‌ అభిమానులతో పాటు దేశంలోని అన్ని భాషల అభిమానుల్లోనూ ఆసక్తి ఉంది. ప్రభాస్‌ చెప్పిన ఆ ‘స్పెషల్‌ పర్సన్‌’ ఎవరు? సినిమా గురించి అన్నాడా? అన్న విషయాలు ఆయన మరో పోస్ట్‌ చేసేదాక సస్పెన్స్‌గానే ఉంటాయి.  ఈ ఒక్క పోస్ట్‌ తో ఆడియన్స్‌ అందరినీ డైలామాలో పేడేశాడు ప్రభాస్‌. దీంతో.. అన్నా ఈ ట్విస్ట్‌ ఏంటన్నా? తొందరగా చెప్పన్నా.. టెన్షన్‌ తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరేమో.. మా డార్లింగ్‌ ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్స్‌ తో రెచ్చిపోతున్నారు. మనం ఏమనుకున్నా అసలు విషయం తెలియాలంటే.. ప్రభాస్‌ ఆ ట్విస్ట్‌ రివీల్‌ చేసేవరకు ఆగాల్సిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !