Telangana CM : రేవంత్‌రెడ్డే సిఎం

0

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ నిన్న జరగాల్సిన ప్రమాణస్వీకారం ఎందుకు ఆగింది.? ప్రజలు క్లియెరెన్స్‌ ఇచ్చినా నాయకుల్లో కన్‌ఫ్యూజన్‌ ఎందుకు? రేవంత్‌కు సీఎం పదవికి అడ్డుపడుతున్నది ఎవరు ? సిఎం పదవి ఇవ్వడంపై ఏకాభిప్రాయం ఎందుకు కుదరటం లేదు ? ప్రమాణస్వీకారానికి ఎందుకు జాప్యం.? సీఎం రేసులో రేవంత్‌తో పాటు భట్టీ, ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహా, జానారెడ్డి వంటి ఇంకా చాలా మంది పేర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎవరికి వారు సిఎం పదవి కోసం పట్టుబట్టటం, కాంగ్రెస్‌ పెద్దల చేత లాబియింగ్‌ చేయించటంలో తలమునకై ఉన్నారు. సీఎం పదవిపై ఏకాభిప్రాయం వచ్చినా డిప్యూటీ సీఎం..కేబినెట్‌ శాఖలపై ఏకత్వం పొసగడంలేదా?  రేవంత్‌.. భట్టి విక్రమార్క.. ఉత్తమ్‌కుమార్‌.. శ్రీధర్‌బాబు.. పొన్నం ప్రభాకర్‌ అండ్‌ కోమటిరెడ్డి బ్రదర్స్‌, ఎవరి ఆవాజ్‌ ఏంటన్నది చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

మంచి శాఖల కోసమే పట్టు !

కొత్త సర్కార్‌లో  డిప్యూటీ సీఎం ఒకరా ? ఇద్దరా? పీసీసీ పగ్గాలెవరికి? ఎల్లా హోటల్‌ మీటింగ్‌ సారాంశం ప్రకారం .. సామాజిక సూత్రం ప్రకారం ఎస్టీ, బీసీలకు చెరొకటి చొప్పున రెండు  డిప్యూటీ సీఎంలు ఇవ్వాలన్నది పార్టీ లైన్‌. రేవంత్‌కు సీఎం.. భట్టికీ డిప్యూటీ సీఎం. ఇంత వరకు ఓకే. కానీ బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్‌ డిప్యూటీ  సీఎం గిరిపై గురిపెట్టారట. కానీ భట్టి నుంచి అబ్జక్షన్‌. ఉంటే ఒకరే డిప్యూటీ సీఎం ఉండాలన్నది భట్టి వాదన. దాంతో  భట్టికి   స్పీకర్‌ పదవి ఆఫర్‌ చేశారట పార్టీ పెద్దలు.  ఒకవేళ ఆయన అందుకు అంగీకరించకపోతే  శ్రీధర్‌బాబుకు స్పీకర్‌ పదవి ఇవ్వాలనేది సమాలోచనల సారాంశం. ఇదిలా ఉంటే  రెండు టర్మ్‌లు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తన మనసులో మాటను స్పష్టం చేశారు. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే తన సతీమణి పద్మావతికి కేబినెట్‌లో కీలక శాఖ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఎల్లా హోటల్‌లో  గెలిచిన అభ్యర్థుల సమక్షంలో చర్చోపచర్చలు  జరుగుతుంటే మరోవైపు పార్క్‌ హయత్‌ హోటల్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆధ్వర్యంలో టేబుల్‌ బేటీలు జరిగాయి.  రాజ్‌భవన్‌లో  ప్రమాణస్వీకారం ఏర్పాట్లు.. కొత్త సర్కార్‌కు కాన్వాయ్‌  అరెంజ్‌మెంట్‌  చకచకా జరిగాయి. కానీ ఎల్లా హోటల్‌  సమావేశం నుంచి మాత్రం సీఎం ఎవరనే సందేశం రాలేదు.  సడెన్‌గా సీను ఢల్లీికి మారింది. షరామాములుగానే  మళ్లీ సీల్డ్‌ కవర్‌ కాంగ్రెసీయం తెరపైకి వచ్చింది. ప్రమాణ స్వీకారం ఆలస్యానికి కారణం..సీఎం ఎవరనే ఇంకా తేలకపోవడమా? రేవంత్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌, కేబినెట్‌లో కీలక శాఖలపై  అభిప్రాయాలు పొసగకపోవడమా?

రాహుల్‌గాంధీ మనసులో రేవంత్‌రెడ్డి !

కాంగ్రెస్‌లో మహామహులైన సీనియర్‌ నాయకులు ఉండగా, రాహుల్‌గాంధీ టీపీసీసీ పదవిని రేవంత్‌రెడ్డికి ఎందుకు కట్టబెట్టారు. అదే నమ్మకంతో ఇప్పుడు సిఎంగా రేవంత్‌రెడ్డినే ఎంపిక చేయబోతున్నారు. ఎంత మంది ఎన్ని అభ్యంతరాలు తెలిపినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా రాహుల్‌గాంధీ  ఏ మాత్రం లక్ష్య పెట్టడం లేదు. రేవంత్‌రెడ్డి దూకుడు, ఇతరులపై ఆధపత్యం చేయగల సత్తాను గమనించిన రాహుల్‌ గాంధీ రాబోయే 4 నెలల్లో లోక్‌సభ ఎన్నికల్లోనూ 17 కి 15 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. సమర్థుడైన నాయకుడు ఉంటేనే లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య పెరుగుతుందని నమ్మకంతో ఉన్నారు. సౌంతిండియాలో కాంగ్రెస్‌ మరియు తన అనుకూల పార్టీలు అత్యధిక సీట్లు ఎంపీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతోంది. ఒక వైపు కర్ణాటక, మరో వైపు తెలంగాణ, మరో వైపు తమిళనాడులో డిఎంకె మిత్రపక్షంగా ఉంది. కేరళలో మరో మిత్రపక్షం అయిన సిపీఐ ఉండనే ఉంది. ఇక మిగలింది అల్లా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని నిలువరించి నార్త్‌ ఇండియాలో ఏ మాత్రం కొంచం ప్రభావం చూపిన మోడీని దించవచ్చు అనే ఆలోచనతో ముందుకుపోతుంది కాంగ్రెస్‌. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !