Tillu Square : గ్లామర్‌ డోస్‌ పెంచేసిన అనుపమ - రెమ్యునరేషన్‌ కూడా అదే రేంజ్‌లో !

0

అనుపమ పరమేశ్వరన్‌ - ఇప్పుడీ పేరు వింటే కుర్రాళ్ల గుండెకు చెమటలు పట్టాల్సిందే. ఒకప్పుడు క్లాస్‌ లుక్స్‌​లో ట్రెడిషనల్‌​గా ఉండే పాత్రలు పోషించే ఈమె ఇప్పుడు పూర్తిగా గేర్‌​ మార్చేసింది. అందాల ఆరబోతతోనే కెరీర్‌​ను నెట్టుకొచ్చే పరిస్థితికి వచ్చేసింది. తాజాగా విడుదలైన DJ TILLU SQUARE ట్రైలర్‌ చూసి యూత్‌​ అంతా షాకైపోయారు. అనుపమ బోల్డ్‌​ యాక్టింగ్‌ చూసి కొంతమందైతే తాము బాగా హర్ట్‌ అయినట్లు వీడియోలు కూడా రిలీజ్‌ చేశారు. అయితే తాజాగా ఈ మూవీలో చేసిన గ్లామర్‌​ షో కోసం అనుపమ ఎంత మొత్తంలో రెమ్యునరేషన్‌ తీసుకొచ్చిందో వివరాలు బయటకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే. ప్రేమమ్‌​తో పరిచయమైన మలయాళి భామ అనుపమ పరమేశ్వరన్‌ (ANUPAMA PARAMERSWARAN) ఆ తర్వాత శతమానం భవతి, వున్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్‌ ఐ లవ్‌ యూ, హలో గురు ప్రేమ కోసం వంటి చిత్రాల్లో నటించి యూత్‌​కు డ్రీమ్‌ గర్ల్‌​గా మారిపోయింది. మొదట్లో  ఒద్దికగా, పద్థతిగా, ట్రెడిషనల్‌​గానే కనిపించినప్పటికీ క్రమక్రమంగా గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌​ రావట్లేదు కదా అందుకే గ్లామర్‌ డోస్‌ కాస్త పెంచిందని అంతా అనుకున్నారు. అప్పటికీ పెరుగుతున్న ఆమె అందాల ఆరబోతను చూసి సర్దుకుపోయారు యూత్‌. కానీ ఆ తర్వాత షాక్‌ అయ్యే రేంజ్‌​లో డోస్‌​ను పెంచేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. కుర్రకారుకు నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. ఇక రౌడీ బాయ్స్‌ సినిమాతో లిప్‌​ లాక్‌ కిస్‌ పెట్టడం కూడా మొదలెట్టేసింది. ఫ్యాన్స్‌ ఫీలవ్వడం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత కార్తికేయ 2, 18 పేజీస్‌ వంటి చిత్రాల్లో ట్రెడిషనల్‌​గానే కనిపించింది. దీంతో అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. కానీ డీజే టిల్లు స్క్వేర్‌​ (DJ TILLU SQUARE) లో ఊహించని రేంజ్‌​లో హద్దులు దాటేసి మరీ రొమాన్స్‌ సీన్స్‌​, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌​లు, లిప్‌​ కిస్‌​లతో రెచ్చిపోయింది. కుర్రాళ్లైతే పరేషాన్‌ అయిపోయారు. అయితే ఇలా గ్లామర్‌ ట్రీట్‌ ఇవ్వడం కోసం అనుమప రెమ్యునరేషన్‌​ను గట్టిగానే అందుకుందట. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్‌ అందుకున్న ఈ ఉంగరాల జుట్టు భామ - ‘టిల్లు స్వ‍్క్ఱర్‌’ కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు అందుకుందని తెలిసింది. కాగా, మార్చి 29న ‘డీజే టిల్లు 2’ థియేటర్లలోకి రాబోతుంది.


భారీ డిమాండ్‌ పలికిన ఓటీటీ రైట్స్‌ ? 

DJ TILLU SQUARE మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రచార చిత్రంలో హీరో,హీరోయిన్‌ల మధ్య సంభాషణలు ‘డీజే టిల్లు’ చిత్రాన్ని గుర్తు చేశాయి. అనుపమ మునుపెన్నడూ కనిపించనంత హాట్‌గా ఇందులో దర్శనమిచ్చి యువత మతి పోగొట్టింది. థియేటర్‌లో విడుదల కాకముందే ‘టిల్లు స్క్వేర్‌’ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ కోసం భారీ డిమాండ్‌ నెలకొనగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజింగ్‌ అమౌంట్‌ కోట్‌ చేసి, హక్కులు దక్కించుకున్నట్లు టాక్‌. రూ.35 కోట్లకు ఈ డీల్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఒక యువ కథానాయకుడి చిత్రానికి ఈ స్థాయిలో డీల్‌ జరగడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయింది. ‘డీజే టిల్లు’లో తన నటన, స్వాగ్‌తో యూత్‌ ఐకాన్‌ అయిపోయారు సిద్ధు జొన్నలగడ్డ. దీంతో ‘టిల్లు స్క్వేర్‌’ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. రామ్‌ మిర్యాల సంగీతం అందించిన ఈ చిత్రానికి తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !