AP : DSC నోటీఫికేషన్‌ విడుదల...నేటి నుండే దరఖాస్తులు !

0


ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎన్నికల ముందు హడావుడిగా షెడ్యూల్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

మార్చి 15 నుంచి 30 వరకు రెండు 

మొత్తం ఉద్యోగాల్లో 2,280 ఎస్జీటీ పోస్టులు ఉండగా.. స్కూల్‌ అసిస్టెంట్‌ 2,299బీ టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్‌ 42 చొప్పున ఉన్నాయి. ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు ఆప్షన్‌ను మాత్రం ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. ఏపీ డీఎస్సీ 2024 పరీక్షకు మార్చి 5 నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు జరుగుతాయి. సెషన్‌ 1 ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకుబీ సెషన్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేసి ఏప్రిల్‌ 1వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 2న తుది కీ విడుదల చేసి ఫలితాలను ఏప్రిల్‌ 7న ప్రకటిస్తారు. 2018 డీఎస్సీ సిలబస్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. షంవ.aజూస్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచారు. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా..  రిజర్వ్‌ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !